Bike engine
-
రయ్.. రయ్.. ఐడియా ఆన్ వీల్స్!
ఆలోచనే మనిషికి ఇం‘ధనం’. దాన్నే పెట్టుబడిగా చేసుకుని ‘రోడ్డెక్కితే’ ఎన్నో కొత్త అంశాలు ఆవిష్కృతమవుతాయి. ‘మేనుకు చేవ / చేతికి రొక్కం’ రెండూ దక్కుతాయి. అసలు మస్తిష్కానికి పదును పెట్టాలే గానీ అద్భుతాలు మన ముంగిటే వచ్చి వాల్తాయి. అలాంటి అద్భుతాన్ని ఇదిగో ఇలా చేసి చూపించాడు ఓ రిక్షావాలా. చిన్న ద్విచక్ర వాహన ఇంజినుకు రిక్షాను అనుసంధానించి రయ్ మంటూ విజయవాడ వీధులో వెళ్తున్న ఈ రిక్షావాలా ప్రయోగాన్ని అందరూ ముక్కున వేలేసుకుని మరీ చూస్తున్నారు. భళిరా! నీ ఆలోచన అంటూ అభినందిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇక్కడ చదవండి: Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా Photo Feature: విరగకాసిన పనస చెట్టు -
వ్యవసాయ మెషిన్‌ను తయారు చేసిన బైక్ మెకానిక్
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి బాల్‌రెడ్డి 15 సంత్సరాలు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఓ బైక్ మెకానిక్ తనకున్న నైపుణ్యంతో వ్యవసాయానికి ఉపయోగపడాలనే తపన కలిగింది. అందుకు తన నైపుణ్యాన్ని ఉపయోగించి బైక్ ఇంజన్‌తో నడిచే వ్యవసాయ పని యంత్రాన్ని తయారు చేశాడు. రైతులు ఒక ఎకరం భూమిలో వేసిన మొక్కజొన్న పంటకు దంతే, గడ్డి తీసేందుకు వెచ్చించే ఖర్చు మొత్తంతో పోల్చితే అతి తక్కువ వ్యయంతో బైక్ ఇంజన్ దంతె యంత్రంతో ఎకరం భూమిని సాగుచేసుకోవచ్చు. సాధారణంగా ఒక ఎకరానికి దంతె కూలీలకు 2వేలు ఖర్చు అయ్యేదని, ఈ యంత్రం ద్వారా రూ. 300లతో ఎకరం భూమిలో దంతె కొట్టుకోవచ్చని తెలిపాడు. నాలుగు లీటర్ల పెట్రోల్‌తో ఎకరం భూమిలో దంతె ద్వారా గడ్డి, భూమి చదువను చేయవచ్చని మెకానిక్ బాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో చాలా మంది తమ వ్యవసాయ పనుల్లో నిమిత్తం ఈ ఇంజన్ దంతెను ఉపయోగించుకుంటూ ఖర్చులను ఆదా చేసుకుంటున్నారు. తన మిత్రుడు వెల్డింగ్ చేయగా బైక్ ఇంజన్ దంతె యంత్రాన్ని తయారు చేశారు. -
బైక్ ఇంజిన్ పనిచేసేదిలా...
ఎక్కామా... కిక్కొట్టామా.. యాక్సిలరేటర్ రైజ్ చేశామా.. రయ్యిమని దూసుకెళ్లామా అదీ మనం నిత్యం చేసే పని. కిక్ కొట్టగానే ఇంజిన్‌లో ఏమవుతుంది? మనల్ని ముందుకు తీసుకెళ్లేంత శక్తి అక్కడెలా పుడుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చేతక్ స్కూటర్లకు దాదాపు కాలం చెల్లిపోయింది కాబట్టి వాటి సంగతి పక్కనబెడదాం. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోర్‌స్ట్రోక్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం... పేరులో ఉన్నట్టుగానే ఈ ఇంజిన్లు స్థూలంగా నాలుగు దశల్లో పనిచేస్తాయి. ఒక్కో దశ గురించి వివరంగా... 1. దీన్నే ఇండక్షన్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఈ దశలో పైవైపు నుంచి ఇంధనం, గాలుల మిశ్రమం ఇంజిన్ ఛాంబర్ లోపలికి వస్తుంది. అదే సమయంలో పిస్టన్ కిందకు జారుతూ ఉంటుంది. 2. పిస్టన్ పైకి కదలడం మొదలవుతుంది. ఇంధనం సరఫరా చేసే వాల్వ్‌తోపాటు, బయటకు పంపే ఎగ్జాస్ట్ వాల్వ్ కూడా మూసుకునే ఉండటం వల్ల ఛాంబర్లో ఉండే అతితక్కువ స్థలంలోనే గాలి, ఇంధనాల మిశ్రమం కంప్రెస్ అవుతుంది. ఈ దశను కంప్రెషన్ స్ట్రోక్ అని కూడా అంటారు. 3. ఇగ్నీషన్ నుంచి వెలువడే స్పార్క్ గాలి, ఇంధనాల మిశ్రమాన్ని మండిస్తుంది. అప్పటికే బాగా ఒత్తిడితో ఉన్న ఈ మిశ్రమం ఒక్కసారిగా మండిపోతుంది. ఇన్లెట్, ఎగ్జాస్ట్ వాల్వ్‌లు రెండూ మూసుకునే ఉంటాయి. ఫలితంగా వెలువడే శక్తి పిస్టన్ను తద్వారా క్రాంక్‌షాఫ్ట్‌ను కదిలిస్తుంది. వాహనానికి శక్తినిచ్చే దశ కాబట్టి దీన్ని పవర్ స్ట్రోక్ అని కూడా అంటారు. 4. ఈ దశలో ఎగ్జాస్ట్ వాల్వ్ తెరుచుకోవడంతో అప్పటికే మండిపోయిన గాలి, ఇంధన మిశ్రమం తాలూకూ వాయువులు దీనిగుండా బయటకు వెళ్లిపోతాయి. పిస్టన్ కూడా పైవైపు ప్రయాణిస్తూ వాయువులన్నీ బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. ఈ దశను ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని పిలుస్తారు. ఈ 4 దశలు వెంటవెంటనే జరిగిపోతూ వాహనం ముందుకెళ్లేందుకు అవసరమైన శక్తిని అందిస్తాయన్నమాట.