మెకానిక్ కొమ్మిడి బాల్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి బాల్‌రెడ్డి 15 సంత్సరాలు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఓ బైక్ మెకానిక్ తనకున్న నైపుణ్యంతో వ్యవసాయానికి ఉపయోగపడాలనే తపన కలిగింది. అందుకు తన నైపుణ్యాన్ని ఉపయోగించి బైక్ ఇంజన్‌తో నడిచే వ్యవసాయ పని యంత్రాన్ని తయారు చేశాడు. రైతులు ఒక ఎకరం భూమిలో వేసిన మొక్కజొన్న పంటకు దంతే, గడ్డి తీసేందుకు వెచ్చించే ఖర్చు మొత్తంతో పోల్చితే అతి తక్కువ వ్యయంతో బైక్ ఇంజన్ దంతె యంత్రంతో ఎకరం భూమిని సాగుచేసుకోవచ్చు.
సాధారణంగా ఒక ఎకరానికి దంతె కూలీలకు 2వేలు ఖర్చు అయ్యేదని, ఈ యంత్రం ద్వారా రూ. 300లతో ఎకరం భూమిలో దంతె కొట్టుకోవచ్చని తెలిపాడు. నాలుగు లీటర్ల పెట్రోల్‌తో ఎకరం భూమిలో దంతె ద్వారా గడ్డి, భూమి చదువను చేయవచ్చని మెకానిక్ బాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో చాలా మంది తమ వ్యవసాయ పనుల్లో నిమిత్తం ఈ ఇంజన్ దంతెను ఉపయోగించుకుంటూ ఖర్చులను ఆదా చేసుకుంటున్నారు. తన మిత్రుడు వెల్డింగ్ చేయగా బైక్ ఇంజన్ దంతె యంత్రాన్ని తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment