bio-diesel tanks burst
-
విశాఖ ప్రమాదంలో అదుపులోకి రాని మంటలు
విశాఖపట్నం: విశాఖ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 40 ఫైరింజన్లతో 14 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో పది గంటలు పడుతుందని అధికారులు చెప్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి. బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు. మంగళవారం రాత్రి బయోమాక్స్ కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లో మొత్తం 18 ట్యాంకులు ఉండగా..11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. మిగతా ఆరు ట్యాంకులను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. సుమారు రూ.200 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. నేవీ హెలికాఫ్టర్తో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు. ఆస్తి నష్టం పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చినరాజప్ప తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలో ఉన్న బయో డీజిల్ వల్లే మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని ఫైర్ అధికారులు చెప్పుతున్నారు. -
విశాఖ బయోమాక్స్లో అగ్ని ప్రమాదం
♦ దగ్ధమైన 12 డీజిల్ ట్యాంకులు ♦ సుమారు రూ.50 కోట్ల నష్టం ♦ అర్ధరాత్రి దాటినా అదుపులోకి రాని మంటలు సాక్షి, విశాఖపట్నం, అగనంపూడి: విశాఖ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ కంపెనీలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 7.30 గంటల సమయంలో ముడి ఇంధనం (డీజిల్)తో కూడిన ఓ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పదిమంది కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అనంతరం ఒక్కొక్కటిగా అక్కడ ఉన్న 11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. సుమారు రూ.50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో ట్యాంకులో 1,500 టన్నుల నుంచి 2,700 టన్నుల వరకు ముడి ఇంధనం ఉంది. మరో 6 ట్యాంకుల్లో తయారైన బయో డీజిల్ ఉంది. మిషన్లతోనే ఎక్కువగా పని జరుగుతుండటం, తక్కువ మంది కార్మికులు ఉండటం, వారు కూడా బయటకు వచ్చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అన్ని ఫైర్ స్టేషన్ల నుంచి 22 ఫైర్ ఇంజన్లను రప్పించారు. హెచ్పీసీఎల్, స్టీల్ ప్లాంట్ల నుంచి ఫోమ్ ఫైర్ ఇంజన్లను రప్పించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ట్యాంకుల్లో ఉన్న డీజిల్ మొత్తం కాలిపోతే తప్ప మంటలు అదుపులోకి రావని అధికారులు తేల్చేశారు. 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు కనిపించాయి. బయో డీజిల్ కావడంతో పొగ కాలుష్యం భారీయెత్తున ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. షార్ట్ సర్క్యూటే కారణం? ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. ఘటనా స్థలికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చారు... అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్లాంట్లో మొత్తం 18 ట్యాంకులు ఉన్నాయని చెప్పారు. మంటలు అదుపులోకి రావడానికి మరో ఆరు గంటల సమయం పట్టవచ్చన్నారు. -
విశాఖలో భారీ అగ్నిప్రమాదం