సమస్యలు పరిష్కరించాలని తరగతుల బహిష్కరణ
కుభీర్ : తమ పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మాలేగాం ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో బైటాయించారు.
మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని, గుడ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు సరిగ్గా రావడం లేదని తెలిపారు. ఎప్పుడూ పప్పు మాత్రమే వండుతున్నారని, కూరగాయలు, గుడ్లు పెట్టడం లేదన్నారు. మరుగుదొడ్లు సక్రమంగా లేవని, నీటి సమస్య ఉందని, బెంచీలు లేక నేలపై కూర్చుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల భవనం ఉరుస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులను గ్రామపెద్దలు సముదాయించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ వివరాలు నోటీసు బోర్డుపై లేవు. చాక్‌పీస్‌లు, డస్టర్లు సక్రమంగా లేవన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను ప్రశ్నించగా అన్ని సక్రమంగానే ఉన్నాయని, విద్యార్థులను కొందరు ఉపాధ్యాయులే రెచ్చకొడుతున్నారని తెలిపారు. చివరకు ఉపాధ్యాయులు సముదాయించడంతో విద్యార్థులు తరగతుల్లోకి వెళ్లారు.