ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి
వెలుగులీనుతున్న చర్చిలు
* మాల్స్, చర్చిల్లో ఆకట్టుకుంటున్న క్రిస్మస్ ట్రీలు
* అసహనంపై గోవా బిషప్ ఆందోళన
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో ఇళ్లు, చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రపంచం లోని వివిధ నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ,దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు క్రిస్మస్ శోభతో కాంతులీనుతున్నాయి. ఎక్కడ చూసినా శాంటాక్లాజ్ డ్రస్సుల్లో చిన్నారుల సందడే. ఇక పెద్దలు స్వీట్లు, కేక్‌లు పంచుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత, తదితరులు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
అసహనంపై గోవా బిషప్ ఆందోళన
పనాజీ: దేశంలో పెరుగుతున్న అసహనం తీవ్రత ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆర్చ్‌బిషప్ ఆఫ్ గోవా ఫిలిప్ నెరి ఫెర్రావో ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలు, సంస్కృతుల ప్రజల మధ్య అసహనం పెరుగుతోందన్నారు. అవగాహన, సయోధ్య, శాంతి మొదలైన వాటి ద్వారా అసహనానికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తన క్రిస్మస్ సందేశంలో స్పష్టం చేశారు.