బీవీఆర్ఐటీలో కెంకాన్
నేటి నుంచి జాతీయ సదస్సు
రెండు రోజల పాటు కొనసాగింపు
12 అంశాలపై ప్రజెంటేషన్
వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు రాక
నర్సాపూర్:స్థానిక బీవీఆర్ఐటీ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశంలోని ఎంపిక చేసిన కళాశాలల్లో జాతీయ స్థాయి సదస్సులు జరుగుతాయి. ఈసారి బీవీఆర్ఐటీకి సదస్సు నిర్వహించే అవకాశం లభించింది. 12వ వార్షిక సెషన్ ఆఫ్, స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు కెంకాన్-2016 పేరు పెట్టారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యిమంది విద్యార్థులు, ప్రోఫెసర్లు హాజరు కానున్నారు. బీవీఆర్ఐటీ కాలేజీలో గతంలో పలు రాష్ట్ర జాతీయ స్థాయి సదస్సులు జరిగాయి. మరోసారి ఈ కాలేజీ వేదిక కానుంది.
సదస్సులతో ఎంతో మేలు
సదస్సులో పాల్గొనే విద్యార్థులు, ప్రొఫెసర్లు, కాలేజీ ప్రిన్సిపాల్‌తో సాక్షి మాట్లాడగా సదస్సులతో విద్యార్థులకు మేలు చేకూరుతుందని అన్నారు. సదస్సులో 12 అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ పేపర్స్ అందచేశారు. వాటిని పరీశీలించి నిబంధనల మేరకు ఎంపిక చేసినట్లు తెలిసింది.
---------------------- అభిప్రాయాలు---------
ఆనందంగా ఉంది
జాతీయ స్థాయి సదస్సును తమ కాలేజీలో చేపట్టడం ఆనందంగా ఉంది. తాను బోధించే బ్రాంచికి చెందిన సదస్సు చేపట్టడం సంతోషం. కాగా సదస్సులతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
- డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ బీవీఆర్ఐటీ
మార్పులు తెలుసుకోవచ్చు
సబ్జెక్టులలో రోజు రోజుకు మార్పులు వస్తున్నందున సదస్సులతో ఆయా సబ్జెక్టులలో ఎలాంటి మార్పులు వస్తున్నాయె విద్యార్థులకు తెలుస్తుంది. విద్యార్థుల ప్రతిభకు సదస్సులు వేదికలుగా వినియోగించుకోవచ్చు. జాతీయ సదస్సుకు తాను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండడం ఆనందంగా ఉంది.
- డాక్టర్ రాధిక, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ
ఆలోచనలకు కార్యరూపం
సదస్సులో విద్యార్థులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు. ఇతర ప్రాంతాల విద్యార్థులు రావడంతో విభిన్న మనస్థత్వం, ఆలోచనలతో ఉంటారు. వారితో కలిసి సాంకేతికపరమైన అంశాలు తెలుసుకోవడంతో పాటు నాలెడ్జ్ పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.
- రమేష్, అసిస్టెంటు ప్రొఫెసర్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచి
సదస్సుకు ఎంపిక కావడం సంతోషం
నా పోస్టర్ ప్రజెంటేషన్.. సదస్సుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వాటర్ ప్యూరిఫికేషన్ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చాను. సదస్సులతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రతిభను చాటేందుకు ఇదొక వేదికగా భావిస్తున్నాను.
- దుసానె, విద్యార్థి, పూణె యూనివర్సిటీ
అనుభవం పెరుగుతుంది
సదస్సుకు తన ప్రజెంటేషన్ ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సదస్సులతో విద్యార్థులలో అనుభవం పెరుగుతుంది. నైపుణ్యం పెంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అనేక మంది పాల్గొనడంతో నాలెడ్జి పెంచుకునే అవకాశం ఉంటుంది.
- క్షేమ, బీఫార్మసీ, వైపర్ కాలేజీ నర్సాపూర్
కెమికల్ ఇంజనీరింగ్‌లో కొత్తదనం
సదస్సులలో పాల్గొనడంతో కెమికల్ ఇంజనీరింగ్‌లో కొత్తదనం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సదస్సులతో అనేక లాభాలున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలిసి పాల్గొనడంతో వారి అనుభవాలు పాలు పంచుకునే అవకాశం ఉంటుంది.
- అంకిత్ మిశ్రా, ఎస్ఆర్ఐసిటీ అంకులేశ్వర్, గుజరాత్
నమ్మకం పెరుగుతుందిః
రాజేశ్వరీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరీంగు బ్రాంచి, బీవీఆర్ఐటీ
నర్సాపూర్ఃసదస్సులలో పాల్గొనడంతో విద్యార్థులలలోఉన్న నైపుణ్యతపై నమ్మకం పెరుగుతుంది. స్టేజీ ఫియర్ పోతుంది. విద్యార్థులు తమను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. తాను మొదటిసారి పాల్గొంటున్నాను. తనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. నైపుణ్యాన్ని నిరూపించె అవకాశంతో పాటు పెంచుకునే అవకాశం రావడడంతో సద్వినియోగం చేసుకుంటాను.
సదస్సులతో కాన్ఫిడెన్స్ పెరుగుతుందిః శివకార్తిక్,బీవీఆర్ఐటీ నర్సాపూర్‌ః
సదస్సులతో విద్యార్థులలో కాన్ఫిడెన్సు పెరుగతుంది. ఇతర రాష్రా్టల వాతావరణం తెలుస్తుంది. సదస్సులలో పాల్గొనడంతో అవగాహన కలుగుతుంది. నాలెడ్జ్ పుంచుకునేందుకు దాహద పడుతాయి. సదస్సులు నిర్వహంచడం అభినందనీయం. జాతీయ స్తాయి సదస్సు చేపట్టడం ఆనంందగా ఉంది.