యువతిపై హాస్టల్ యజమాని అత్యాచారయత్నం
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పరిధిలోని బీకేగూడలో ఉన్న ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్లో ఓ యువతిపై గురువారం లైంగిక దాడి యత్నం జరిగింది. హాస్టల్ యజమాని రవీందర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడబోయాడు. రవీందర్ నుంచి తప్పించుకున్న యువతి ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయిచింది. రవీంద్రపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.... రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.