BK Modi
-
రియల్ ఎస్టేట్ రంగంలో బీకే మోడీ వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా రియల్టీ, వెల్నెస్ విభాగాలలో కార్యకలాపాల విస్తరణపై దృష్టిపెట్టినట్లు బీకే మోడీ గ్రూప్ తాజాగా పేర్కొంది. భారీ వృద్ధి అవకాశాలున్న ఈ రెండు రంగాలలో బిలియన్ డాలర్లు(సుమారు రూ. 8,250 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. రియల్టీ, వెల్నెస్ విభాగాలలో కొత్త టెక్నాలజీలకు వీలున్నట్లు గ్రూప్ వ్యవస్థాపకులు బీకే మోడీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత ప్రాజెక్టులలో విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములు చేయనున్నట్లు తెలియజేశారు. ఒక డెవలపర్‌తో కలసి ఇప్పటికే ముంబైలో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బిజినెస్‌ను మరింత విస్తరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మిక్స్డ్ ప్రాజెక్టుకు రెడీ ప్రయివేట్ స్మార్ట్ సిటీ ఆలోచనపై స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో మిక్స్డ్ వినియోగానికి వీలైన ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు మోడీ తెలియజేశారు. -
ఈ-వెహికల్ విభాగంలోకి స్మార్ట్ గ్లోబల్ గ్రూప్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి బీకే మోడీ నేతృత్వంలోని స్మార్ట్ గ్లోబల్ గ్రూప్ ప్రవేశిస్తోంది. తొలి దశలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్యాక్సీలను మార్కెట్లోకి తీసుకురావాలన్నది తమ ప్రయత్నమని గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ బీకే మోడీ ఇక్కడ విలేకరులకు తెలిపారు. తరువాత పాసింజర్ వాహనాలను ఆవిష్కరించాలన్నది లక్ష్యమన్నారు. ‘స్మార్ట్ డ్రీమ్స్’ బ్రాండ్‌తో ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మురాదాబాద్‌లోని మూడీ సిటీలో ఎలక్ట్రిక్ బస్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రంగంలో తమ లక్ష్యాల సాధనకు వీలుగా ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ సంస్థ ‘బిల్డ్ యువర్ డ్రీమ్స్’ (బీవైడీ)తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలోనే వాహన ఉత్పత్తి జరపనున్నట్లు మోడీ తెలిపారు. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్టుపై దాదాపు బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.