అయ్యప్ప దీక్ష.. ఆరోగ్య రక్ష
చన్నీటి స్నానం
భక్తులు దీక్ష కాలమంతా తెల్లవారుజామునే లేచి శిరస్నానం చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. చల్లటి నీళ్లతో శిరస్నానం చేయడం వల్ల మనసుకు హాయినిస్తుంది. ఏకాగ్రత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే.. శిరోభాగం(మెదడు) ఆలోచనలకు కేంద్ర బిందువు. నిత్యం ఆలోచనలతో రాపిడి ఏర్పడి తల వేడెక్కుతుంది. ఇది ఆరోగ్యానికి ఓ రకంగా హాని కలిగిస్తుంది. ప్రతి రోజూ చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఉష్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
మితాహారం..
దీక్షాపరులు ప్రతిరోజూ మితాహారం మాత్రమే తీసుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం, రాత్రి తిరిగి అల్పాహారం తింటారు. దీనివల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండడంతోపాటు వ్యాధులు దూరమవుతాయి. దీక్షాధారులు తీసుకునే ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉంటుంది. ఈ వంటల్లో వెల్లుల్లి, ఉల్లి, అల్లం వంటి మసాల దినుసులను ఉపయోగించరు. దీనివల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
పాదరక్షలు లేకుండా..
దీక్షా కాలమంతా భక్తులు పాద రక్షలు ధరించరు. శబరిమల, ఇతర యాత్రలకు వెళ్లేటప్పుడు యాత్ర అంతా పాదరక్షలు లేకుండానే చేయాల్సి వస్తుంది. దీని వల్ల యాత్రకు ఇబ్బందులు రావు. భూమికి ఉష్ణోగ్రత, అయస్కాంత తత్వం ఉంటాయి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల భూస్థితికి తగిన రీతిలో రక్తప్రసరణలు, హృదయ స్పందనలు సమకూరుతాయి.
భూతలశయనం..
దీక్ష చేపట్టే భక్తులు నిత్యం కఠిన నేలపై నిద్రిస్తుంటారు. భూశయనం సుఖాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. భూమి మీద కాసేపు పడుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్యోపరంగా కూడా మేలు చేస్తుంది. భూమిలో శక్తి మార్పిడి శరీరానికి శక్తి అందిస్తుంది.
చల్లని చందనం
రెండు కనుబొమ్మల మధ్య నుదిటి భాగం యోగా రీత్యా విశిష్టమైనది. పాలభాగంగా పిలిచే ఈప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల దృష్టి కేంద్రీకృతం కాదు. నాడీ మండలానికి కేంద్రమైన నుదుటి భాగంపై సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయకంగా చెబుతారు.
నల్లని దుస్తులు
అయప్ప స్వాములు నల్లని దుస్తులు ధరించాలన్న నియమం ఉంది. దీక్షలు చలికాలంలో చేయాల్సి ఉంటుంది. ఈ దీక్షా కాలంలో ఎండ వేడిమిని వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో నలుపు రంగు ఉపయోగంగా ఉంటుంది. అంతే కాకుండా దీక్షా కాలం ముగిసిన పిదప శబరీశుడి దర్శన కోసం వనయాత్ర చేయాల్సి ఉంటుంది. అక్కడ వన్యమృగాల బారి నుంచి తప్పించుకునేందుకు నలుపు రంగు రక్షణగా ఉంటుంది.
పూర్వజన్మ సుకృతం..
అయ్యప్పస్వామి మాలాధారణ పూర్వజన్మ సుకృతం. ఇప్పటి వరకు 16 సార్లు అయ్యప్ప మాల వేశాను. అన్ని విధాలా బాగుంటుంది. మండల కాలం పాటు కఠిన నియమాలతో దీక్షనాచరించి నారికేళమనే దేహంలోన పవిత్ర మైన నెయ్యి అనే ఆత్మతో నింపి ఇరుముడిలో తీసుకుని వెళ్లి ఆయ్యప్పస్వామి అభిషేకం చేయించి ఆత్మార్పణం చేసుకునే విధానం ఏదీక్షలో లేదు. ఇది చాలా పరమ పవిత్రం. ఉదయం లేచి చల్లటి నీటిస్నానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. - కృష్ణ, గురుస్వామి, బోర్గాం, నిజామాబాద్
స్వామి దర్శనం.. అద్భుతం
శబరిగిరీశుడి దర్శనం.. అద్భుతం. ఆ అనుభూతిని పొందాలంటే మాలను ధరించి, దీక్షను ఆచరించాలి. నాలుగోసారి మాల వేశాను. అయ్యప్పస్వామి కరుణతో అన్నిపనులు అనుకున్నట్లుగా పూర్తవుతున్నాయి. మాల ధరించినప్పటి నుంచి పాటించే నియమాల వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి జరుగుతోంది. దీక్షలో ఉన్నవారికి స్వామి కటాక్షంగా సంపూర్ణంగా ఉంటుందని నమ్ముతున్నాను. అయ్యప్పదీక్షతో ఆధ్మాతిక భావం పెంపొందుతుంది.
- సంజీవరెడ్డి, ఆర్యనగర్, నిజామాబాద్
ఏ రోజు.. ఏ సమయానికి...
ఇందుకు మీరు htt://www.sabarimala.com సైట్లోకి వెళ్లాలి.
ఇక్కడ మీకు స్క్రీన్‌పై సెర్చ్ ఎవైలబిలిటీ ఆప్షన్ వస్తుంది.
ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏ రోజు దర్శనం కావాలో ఇక్కడ మీరు తెలపాల్సి ఉంటుంది.
కచ్చితమైన సమయం, ఎప్పుడు అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
‘స్పెసిఫిక్’ ఆప్షన్ అయితే సమయం ఎంచుకోవచ్చు.
వివరాలు పూరించిన తరువాత సెర్చ్ క్లిక్ చేస్తే, ఎవైలబిలిటీ క్యాలండర్, ఎవైలబిలిటీ గుర్తులు వస్తాయి.
గ్రీన్ కలర్ గుర్తు స్లాట్ ఉందని, లైట్ గ్రీన్ గుర్తు ఉంటే కచ్చితమైన సమయం లేదు కానీ స్లాట్ ఉందని, రెడ్ కలర్ గుర్తు ఉంటే స్లాట్ అందుబాటులో లేదని అర్థం.
ఇక మీరు క్యాలండర్లో ఉన్న గ్రీన్ గుర్తుపై క్లిక్ చేస్తే విండో లెఫ్ట్‌లో సమయం ఎంచుకునేందుకు ఆప్షన్లు వస్తాయి.
మీకు అనుకూలమైనసమయం వద్ద బుక్ నౌ క్లిక్ చేయాలి.
{పత్యక్షమైన కన్ఫర్మ్ బుకింగ్ విండోలో సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి మరోసారి కన్ఫర్మ్ చేయాలి.
ఇక్కడ మీకు గెస్ట్ ప్రొఫైల్ కనిపిస్తుంది.
ఇది స్లాట్ బుకింగ్ పేజ్. కేవలం మూడు నిమిషాల్లో మీరు వివరాలు అందించి స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఇక్కడ అవసరమైన వివరాలు అందించి, 30 కేబీ పరిమాణం మించని సైజ్‌లో గల ఫొటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
తరువాత మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది.
{పింట్ తీసి దాన్ని దర్శన సమయంలో చిన్నపాదం దారిలో అందిస్తే మీకు దర్శనం సులభతరం అవుతుంది.
నోట్ : ఈ విధానానికి ఇరుముడి కట్టుకున్న భక్తులే అర్హులు. వారినే విర్చ్యువల్ క్యూలైన్లో ఉంచుతారు. మీరు ఎంచుకున్న దర్శనం సమయానికి కనీసం 30 నిమిషాలు ముందుగా సంబంధిత క్యూలైన్ వద్దకు చేరుకోవాలి. ఫొటో ఐడీ కచ్చితంగా చూపించాలి.
మరో విధంగా..
htt://www.sabarimala.com సైట్లోకి వెళ్లి విండోలో ఎడమ వైపున పైన రిజిష్టర్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఆప్షన్ వద్ద మీ ఈ-మొయిల్ లేదా ఫోన్ నంబరు ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంచుకోండి.
యాక్టివేషన్ కోడ్ మీ మొబైల్‌కు వస్తుంది. దాన్ని లాగిన్ వద్ద ఎంటర్ చేయాలి.
కనిపిస్తున్న విండోలో మీ వివరాలు, ఫొటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
ఇక్కడి నుంచి మీరు కేవలం సమయం, తేదీ ఎంచుకుంటే సరిపోతుంది.
మీ స్లాట్ వివరాలు మీ మొబైల్‌కు వస్తాయి. ఒకసారి రిజిష్టర్ అయితే ఎప్పుడైనా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
గమనిక : రిజిస్ట్రేషన్ సమయంలో మొబైల్, ఈ-మొయిల్‌కు వచ్చిన యాక్టివేషన్ కోడ్ కేవలం రెండు రోజుల వరకు మాత్రమే వాడుకలో ఉంటుంది.