ఉపాధ్యాయుల వినూత్న నిరసన
భీమవరం టౌన్:ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోని అసంబద్దతలను తొలగించాలని కోరుతూ ఫ్యాప్టో, జాక్టోల సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రకాశంచౌక్‌లో ఫ్లకార్డులను ప్రదర్శించి, ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేశారు. ఫ్యాప్టో, జాక్టో నాయకులు మాట్లాడుతూ వెబ్‌కౌన్సెలింగ్ రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ఇచ్చిన పనితీరు పాయింట్లును ఉపసంహరించాలని, హేతబద్ధీకరణ పేరుతో పాఠశాల మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ సంఘ నాయకుల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, జిల్లా కార్యదర్శి సీహెచ్ పట్టాభి రామయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దావీదు, యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి.సీతారామరాజు, పి.శ్రీనివాసరాజు, ఎన్.భాను మహేష్, జి.సుధాకర్, కె.రవిచంద్రకుమార్, కె.వామనమూర్తి, ఆర్ఆర్ శర్మ, ఐవీఆర్ మోహనరావు, సీహెచ్ ప్రసాదరావు, ఎ.లక్ష్మీ నారాయణ, ఎ.సురేష్‌కుమార్, జి.సూర్యసత్యనారాయణ, ఎస్.మధుసూదనరావు, ఎం.వెంకటేశ్వరరావు, కె.చంద్రరావు పాల్గొన్నారు.