మారిపోయే మేని రంగు!
మెడిక్షనరీ
మేని రంగు నీలంగా మారిపోవడం అన్న లక్షణం ‘బ్లూ స్కిన్ డిజార్డర్’ అనే అరుదైన వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంటుంది. ఇది ఆక్సీజనేటెడ్ రక్తం అందకపోవడం వల్ల కనిపించే నీలం కాదు. దీనికి కారణం... వెండి వస్తువులు శరీరానికి సరిపడకపోవడం. పురాతన గ్రీకు భాషలో వెండిని ‘ఆర్జిరాస్’ అంటారు. అది సరిపడకపోవడాన్ని వైద్య పరిభాషలో ఆర్జీరియా లేదా ఆర్జీరియోసిస్ అని అంటారు. ఈ వ్యాధి ఉన్నవారికి శరీరంలో పూర్తిగా నీలం రంగులోకి గానీ లేదా ఊదారంగులోకి మారిపోతుంది.
వెండికీ, దాని మిశ్రలోహాలకూ కాంతికి ప్రతిస్పందించే గుణం ఉన్నందువల్ల నీలంగా మారిపోయే ఈ పరిణామం జరుగుతుంది. వెండి పాళ్లు ఉన్న పైపూత మందులు వాడినా లేదా కంటిలో వేసే చుక్కల మందులు వాడినా లేదా నోటి ద్వారా లోపలికి వెళ్లినా, దాని ఆవిరులు తగిలినా శరీరం నీలంగా మారిపోయే లక్షణం కనిపిస్తుంటుంది.