ప్రభుత్వ ఉద్యోగాలు లేవు: ఎమ్మెల్యే బొబ్బిలి
బలిజపేట: విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెద్దపెంకి గ్రామ ప్రజలు శుక్రవారం పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను నిలదీశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డగించి ‘బాబు వస్తే జాబు’ అన్నారు’ కానీ, జాబులే లేవేంటని అని ప్రశ్నించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, బ్యాంకు రుణాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తున్నారని, అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే బదులిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.