గుంటూరు అత్తగారికి ప్రధాని ప్రశంస
న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరానికి చెందిన ఓ అత్తగారు తన కోడలికి ఇచ్చిన బహుమానం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోడలి ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్' వెబ్ సైట్ లో గుంటూరు అత్తగారి గురించి ఇలా రాసుంది..
ఆమె పేరు షంషున్. ఊరు గుంటూరు జిల్లా బొల్లవరం. గత ఏడాది తన కుమారుడికి వివాహం సందర్భంగా షంషున్.. కోడలు సల్మాకు మరుగుదొడ్డిని బహుమానంగా ఇచ్చింది. 'పేదరికంలో పుట్టిన నేను బహిర్భూమికే తప్ప టాయిలెట్ రూమ్ ఎరగనను. బయటికి వెళ్లాల్సిన సందర్భంలో ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ప్రతిసారి అవమానభారంతో కుంగిపోయేదాన్ని. కానీ కాలం అలా గడిచిపోయింది. నా పిల్లలూ అలానే పెరిగారు. ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా బంధువులెవ్వరూ మా ఇంటికి రారు.
పొయిన సంవత్సరం కొడుకు మా కొడుక్కి పెళ్లి ఖాయం చేసుకున్నాం. వచ్చే అమ్మాయి చెంబు పట్టుకుని బయటికి వెళ్లడాన్ని నేను ఊహించుకోలేకపోయా. అందుకే టాయిలెట్ కట్టించాల్సిందేనని నిర్ణయించుకున్నా. గవర్నమెంట్ ఇంచ్చేదానికితోడు సొంత డబ్బు నాలుగు వేలు పెట్టి బ్రహ్మాండమైన టాయిలెట్ కట్టించా. కొత్త కోడలికి దానిని బహుమతిగా ఇచ్చా. ఇప్పుడామె గర్భవతి. అంతా సంతోషం..' అంటూ తన గాథ చెప్పుకొచ్చింది షంషున్. ఇలాంటి ఎన్నో నిజజీవిత గాథలతో టాయిలెట్ల నిర్మాణాలపై అవగాహన కల్పిస్తోంది స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
Launch of @SwachhBharat Gramin August campaign is a great step to ensure #FreedomFromOpenDefecation in India. Best wishes to the campaign.
— Narendra Modi (@narendramodi) 2 August 2016
Swachhta Samachar (Inaugural Issue) August 2016.#TransformingIndia #SwachhBharat pic.twitter.com/geYCKPDYuy
— Narendra Singh Tomar (@nstomar) 2 August 2016