అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు నెమ్మిపాటి
అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎంపిక
కర్నూలు: అంతర్జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌కు జిల్లా పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నెమ్మిపాటి లక్ష్మిదేవి ఎంపికయ్యారు. ఈ ఏడాది జూలై 22వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మలేషియాలో ఈ పోటీలు జరగనున్నాయి. విజయలక్ష్మి ప్రస్తుతం ఏఆర్ హెడ్‌క్వాటర్స్‌లోని బాంబ్ డిస్పోజబుల్ టీమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 24 నుంచి 27వ తేదీ వరకు జరగిన మదన్మోహన్ మాలవ్య స్టేడియంలో 35వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. షాట్‌పుట్, హామర్‌త్రోలో వెండి పతకాలు సాధించారు. ఈ సందర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమెను ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.