bond girl
-
జేమ్స్ బాండ్ 007
-
తొలి బాండ్ గాళ్ ఇక లేరు
జేమ్స్ బాండ్ చిత్రాల్లో అలరించిన తొలి బాండ్ గాళ్ యూనిస్ గైసన్(90) కన్నుమూశారు. అనారోగ్యంతో శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 1962లో జేమ్స్ బాండ్ సీన్‌కానరీ చిత్రం డాక్టర్ నో చిత్రంలో నటించి తొలి జేమ్స్ బాండ్ గాళ్‌గా పేరు పొందారు. డాక్టర్ నో, ఫ్రం రష్యా విత్ లవ్ చిత్రాల్లో నటించిన బాండ్ గాళ్ కన్నుమూశారని మైఖేల్ జి విల్సన్ , బార్బరా బ్రకోలీ, బాండ్ సిరీస్ నిర్మాతలు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో ట్విటర్లో గైసన్ మృతిపై సంతాపం సందేశాలు వెల్లువెత్తాయి. గేసన్ 1928 లో సుర్రేలో జన్మించారు. తొలి బాండ్ గర్ల్‌గా అవతరించక ముందు ఆమె 1958లో రివెంజ్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టీన్ సహా అనేక హారర్ సినిమాల్లో కనిపించారు. అలాగే బాండ్ చిత్రాల అనంతరం ది సెయింట్ , ది ఎవెంజర్స్ లాంటి టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. We are very sad to learn that our dear Eunice passed away on June 8th. An amazing lady who left a lasting impression on everyone she met. She will be very much missed. pic.twitter.com/c5kVHs256Y — Eunice Gayson (@EuniceGayson) June 9, 2018 -
భారత్‌కు బాండ్ గర్ల్
స్పెక్టర్ సినిమాలో బాండ్ గర్ల్ గా అలరించిన మోనికా బెలూసి త్వరలో భారత్ కు రానున్నారు. 50 ఏళ్ల వయసులో బాండ్ గర్ల్ గా నటించి మెప్పించిన ఈ సీనియర్ హాలీవుడ్ నటి ఓల్డెస్ట్ బాండ్ గర్ల్ గా రికార్డ్ సృష్టించారు. స్పెక్టర్ తో పాటు ది మ్యాట్రిక్స్ రిలోడెడ్, ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మోనికా ముంబై లో జరగనున్న మామి ముంబై ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నారు. తొలిసారిగా భారత్ కు రావటంపై మోనిక హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫెస్టివల్ లో మోనికా బెలూసి నటించిన ఆన్ ద మిల్కీ వే, ఇర్రివర్సిబుల్ సినిమాలను ప్రదర్శించనున్నారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఆధ్వర్యంలో జరిగే ఆ వేడుక అక్టోబర్ 12 నుంచి 18 వరకు కొనసాగనుంది. అనురాగ్ కశ్యప్ ప్రారంభించనున్న ఈ వేడుకలో 49 దేశాలకు చెందిన 51 భాషల 220 సినిమాలను ప్రదర్శించనున్నారు. -
బాండ్ గర్ల్‌గా బాలీవుడ్ బ్యూటీ
హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. బాండ్ సినిమా రిలీజ్ అవుతుందట.. అన్ని దేశాల్లో ఆ సందడి కనిపిస్తుంది. అందుకే బాండ్ సినిమాలో చిన్న పాత్రలో అయిన కనిపించేందుకు హాలీవుడ్ స్టార్లు సైతం ఆసక్తి కనబరుస్తారు. అలాంటి అరుదైన అవకాశం బాలీవుడ్ బ్యూటీని వరించింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ ఆఫర్లతోనూ ఫుల్ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా రాబోయే బాండ్ సినిమాలో బాండ్ గర్ల్‌గా అలరించనుందట. క్వాంటికో టీవీ సీరిస్తో పాటు, రిలీజ్‌కు రెడీగా ఉన్న బేవాచ్ సినిమాలతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. త్వరలో బాండ్ గర్ల్‌గా నటించిన తొలి ఇండియన్‌గా రికార్డ్ సృష్టించనుంది. బాండ్ గర్ల్స్ అంటే బ్రెయిన్ విత్ బ్యూటీ.. ఈ క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్న ప్రియాంక బాండ్ గర్ల్ పాత్రకు న్యాయం చేస్తుందని భావిస్తున్నారు హాలీవుడ్ నిర్మాతలు. డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. -
బాండ్ గర్ల్ రేసులో మన టాప్ హీరోయిన్లు!
ప్రస్తుతం దేశీ గర్ల్స్ దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా హవా ఇంటాబయటా కొనసాగుతోంది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ జోరు మీద ఉన్న భామలను మరో ఆఫర్ ఊరిస్తోంది. ప్రస్తుతం దీపికా పదుకొనె 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' హాలీవుడ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. మరోవైపు ప్రియాంక 'బేవాచ్' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాలతో ఈ బాలీవుడ్ బ్యూటీలు హాలీవుడ్ సినీ జనాలు దృష్టిని తమవైపు తిప్పుకోవడమే కాకుండా.. భారీ ఆఫర్లు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు దీపికకు, అటు ప్రియాంకకు గట్టి సపోర్ట్ టీమ్స్ ఉండటంతో వీరికి ఆఫర్స్ కోసం పలు హాలీవుడ్ స్టూడియోలకు ప్రతిపాదనలు వెళుతున్నాయట. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన జేమ్స్ బాండ్ తాజా చిత్రంలో హీరోయిన్ కోసం ఈ ఇద్దరు భామలు పోటీపడుతున్నట్టు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. బాండ్ ప్రాంచైజీలో లేటెస్ట్ సినిమా 'స్పెక్టర్' 2015లో వచ్చింది. ఇందులో డానియెల్ క్రెగ్ బాండ్‌గా నటించాడు. కొత్తగా వచ్చే బాండ్ సినిమా కోసం ప్రస్తుతం కొత్త హీరోను అన్వేషిస్తున్నారు. డానియెల్ క్రెగ్ స్థానంలో కొత్త బాండ్ గా సరిపోయే వ్యక్తి కోసం ప్రస్తుతం చిత్రయూనిట్ వెతుకుతోంది. అదే సమయంలో కొత్ బాండ్ గర్ల్ కోసం వేట మొదలైందని, అందులో భాగంగా బాండ్ సరసన హాట్ హాట్ గా కనిపించే హీరోయిన్ కోసం దీపిక, ప్రియాంక పేర్లను కూడా పరిశీలిస్తున్నారని హాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ లో భారీ ఆఫర్లపై కన్నేసిన ఆ ఇద్దరు దేశీగర్ల్స్లో ఎవరికీ ఈ ఆఫర్ వరిస్తుందో చూడాలి అంటున్నారు బాలీవుడ్ జనాలు. -
'హాలీవుడ్ నా బాయ్ ఫ్రెండ్.. బాండ్ గర్ల్‌గా వస్తా'
పిలిప్పీన్స్: తనకు బాండ్ చిత్రాల్లో నటించాలని ఉందని విశ్వసుందరి పియా అలంజో వూర్త్బాచ్ తన మనసులో మాట చెప్పింది. ఇటీవల మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న ఈ పిలిప్పీన్స్ సుందరికి ప్రస్తుతం ఆ విజయాన్ని అనుభవిస్తున్నానని తెలిపింది. తాను విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న రోజు మరువలేనిదని చెప్పింది. ప్రస్తుతం తనకు డేటింగ్, బాయ్ ఫ్రెండ్ వంటి ఆలోచనలేవీ లేవని, హాలీవుడ్ పరిశ్రమే ప్రస్తుతం తనకు బాయ్ ఫ్రెండ్ అని, అందుకే తన కలలు నెరవేర్చుకునేందుకు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పింది. 55 ఏళ్ల అక్వినోతో పియా డేటింగ్ చేసిందన్న పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఆమె పై వివరణ ఇచ్చింది. మున్ముందు వచ్చే జేమ్స్ బాండ్ చిత్రాల్లో బాండ్ గర్ల్ గా నటించాలన్నదే తన కోరిక అని చెప్పింది. పదకొండేళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగుపెట్టిన పియా ఇప్పటికే పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో చిన్నపాత్రల్లో నటించింది. అవేవీ ఆమెకు పేరు ప్రఖ్యాతులు తీసుకురాలేదు. అదీ కాకుండా ఈ సారి ఆమెకు విశ్వసుందరి కిరీటం కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల మధ్య చోటుచేసుకుంది. ఈ ఏడాది నిర్వహించిన విశ్వసుందరి పోటీల్లో వాస్తవానికి పియా నే విజేతగా నిలిచినా.. విజేతల ప్రకటనలో కొంత గందరగోళం జరిగి, వివాదాస్పదంగా మారింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే తొలుత ఈ విజేతలను తారుమారుగా ప్రకటించారు. తొలిస్థానంలో కొలంబియా యువతి అరియాడ్నా, రెండో స్థానంలోఅలొంజో, మూడో స్థానంలో ఒలివియా నిలిచారని చెప్పారు. అరియాడ్నా వేదికపై క్యాట్‌వాక్ చేసి ప్రేక్షకులకు అభివాదం కూడా చేసింది. గత ఏడాది మిస్ యూనివర్స్, కొలంబియాకే చెందిన పౌలినా వెగా వేదికపైకి చేరుకుని అరియాడ్నా తలపై కిరీటం పెట్టింది. కానీ విజేతలను ప్రకటించడంలో పొరపాటు జరిగిందంటూ నిర్వాహకుడు స్టీవ్ హార్వే ఒక్కసారిగా షాకిచ్చారు. మొదటి స్థానంలో పియా, రెండో స్థానంలో అరియాడ్నా నిలిచినట్లు ప్రకటించారు. ఈ తప్పిదానికి తాను బాధ్యత వహిస్తానని, ఎవరూ బాధపడవద్దని వ్యాఖ్యానించారు. దీంతో తిరిగి వేదికపైకి వచ్చిన మాజీ మిస్ యూనివర్స్ పౌలినా వెగా.. అరియాడ్నా నుంచి కిరీటాన్ని తీసుకుని పియా అలొంజోకు అలంకరించారు. దీంతో గతంలో లేనంత స్థాయిలో విశ్వసుందరి విజేతగా పియాకు భారీ ఎత్తున ప్రచారం లభించింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షించారు. ఈ ప్రచారంతోనే ప్రస్తుతం ఆమె హెచ్ఐవీపై ఇటు అమెరికా ప్రజలను, తమ మాతృదేశం పిలిప్పీన్స్ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కదలడానికి సిద్ధంగాఉంది. తమ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 22శాతానికి పెరిగిందని, ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగానే ఆమె ముందుకు సాగుతానని చెప్పారు. అమెరికాతో తమకు ముందునుంచే సత్సంబంధాలు ఉన్నందున వారి సహాయం కోరేందుకు వెనుకాడబోనని పియా పేర్కొంది. -
బాండ్ గాళ్ సానియా మీర్జా