boora narshaiha goud
-
వారు రాజకీయ మానసిక రోగులు: బూర నర్సయ్య
ఆలేరు: కోమటిరెడ్డి సోద రులు రాజకీయ మానసిక రోగులని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆలేరు, భువనగిరి, జనగాం నియోజకవర్గాల్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఎయిమ్స్‌ను తీసుకువస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాలంటే పక్షులు అటు ఇటు తిరిగినట్లు కాదని, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ గా, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరైంది కాదని దీన్ని రాజకీయ జబ్బు (మెంటలోమానియా) అంటారని విమర్శించారు. ఈ జబ్బు ఉన్నవాళ్లు నేనే చక్రవర్తినని అనుకుంటారని కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చురకలంటించారు. ఈ కార్యక్రమం లో బడుగుల లింగయ్య యాదవ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, రాజీవ్‌సాగర్ పాల్గొన్నారు. -
'2019లో కేసీఆర్ ఎవరంటే వారే సీఎం'
హైదరాబాద్: రానున్న 2019 ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అప్పుడు కేసీఆర్ ఎవరంటే వారే టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపడుతారని ఆయన వ్యాఖ్యానించారు. 2019లో సీఎం ఎవరన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు ఊహాగానాలకు తావిచ్చేలా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2019లో కేసీఆర్ నిర్ణయించిన వారే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలతో.. 2019లో కేసీఆర్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టబోరా? అన్న చర్చకు తెరలేచింది.