పోరాటాలతోనే ఎదుగుదల
‘మాలల రణగర్జన’లో అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్
పెదకాకాని(పొన్నూరు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి సమష్టిగా పోరాటాలు చేయడం ద్వారానే మాలలు రాజకీ యంగా ఎదుగుతారని అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అన్నారు. గుంటూరుజిల్లా పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆది వారం మాలల రణగర్జన జరిగింది.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ‘చలో అమరావతి’ పిలుపులో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బహిరంగసభలో భీమ్రావ్ మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాలలు రాజకీయ శక్తిగా ఎదగడానికి ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. మాలల హక్కుల సాధనకోసం సమతా సైనికదళ్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. మాలమహా నాడు రాష్ట్ర నాయకుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఎస్సీ వర్గీకరణ కుట్రను తెలియజేస్తూ కారం శశిధర్, గౌరీశ్వరరావు సంపా దకులుగా రూపొందించిన పుస్తకాన్ని భీమ్రావ్ ఆవిష్కరించారు.