'చివరిగా బ్రేకప్ మెస్సేజ్'
ముంబయి: కీలకమలుపులు తిరిగి సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. ఆమె మొబైల్ ఫోన్ నుంచి తనకు చివరిసారి బ్రేకప్ మెస్సేజ్ వచ్చినట్లు ఆమె బాయ్ ఫ్రెండ్ సవతి తండ్రి కుమారుడు రాహుల్ ముఖర్జియా తెలిపాడు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందనే విషయం తెలిపాడు. ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం రాహుల్ ముఖర్జియాను ఓ ప్రాంతంలోకి వ్యక్తిగతంగా విచారించగా అతడు ఈ విషయం చెప్పినట్లు తెలిసింది.
దాంతోపాటు షీనా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించిన ప్రతిసారి ఆమె వెంటపడటం మానుకో అని చెప్పేదని కూడా పోలీసులకు చెప్పినట్లు అధికారిక వర్గాల సమాచారం. చివరిసారిగా 2012 ఏప్రిల్ 24న ఆమె తన తల్లితో బయలుదేరడానికి కొద్ది గంటల ముందు మాత్రమే రాహుల్ ఆమెను కలిశాడని, ఇక అప్పుడే చివరిసారని కూడా వివరించినట్లు తెలిసింది. కన్నకూతురినే తొలుత సోదరిగా పరిచయం చేసి.. పీటర్‌ను వివాహం ఆడిన ఇంద్రాని ముఖర్జియా ఆమె కుట్రకు భంగం కలిగే పరిస్థితి తలెత్తడంతో షీనాను హత్య చేసిన విషయం తెలిసిందే.