గ్రామీణ క్రికెటర్లను వెలుగులోకి తెస్తా...
దేశంలో వివిధ ప్రాంతాల్లో అకాడమీలు నెలకొల్పి గ్రామీణ క్రికెటర్లను వెలుగులోకి తెస్తానని భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. ప్రస్తుతం అతను ఐదు అకాడమీలు నడుపుతున్నాడు. ఇటీవల వన్డేల్లో రాణించడం ద్వారా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని... త్వరలో టెస్టు జట్టులోకి కూడా తిరిగి వస్తానని హర్భజన్ అన్నాడు.