బ్రిటన్ ఈయూలోనే ఉండాలి: అమెరికా
లండన్: బ్రిటన్ యూరోపియన్ యూనియన్(ఈయూ)లోనే కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన బ్రిటన్ పర్యటన సందర్భంగా కోరారు. జూన్ 23న జరిగే రెఫరెండమ్లో.. బ్రిటన్ ఈయూలో ఉండాలనే ఓటేయాలని ‘డైలీ టెలిగ్రాఫ్ ’రాసిన వ్యాసంలో విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలాఖర్లో జపాన్లో జరిగే జీ7 దేశాల కూటమి భేటీ తర్వాత ఒబామా.. అమెరికా అణుబాంబు దాడిలో ధ్వంసమైన హిరోషిమా నగరాన్ని సందర్శించనున్నారు.