ఒక్కో నౌక 919 అడుగులు.. 65 వేల టన్నులు
లండన్: సముద్రంపై గతంలోనే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బ్రిటన్ ఇప్పుడు కూడా అంతే స్థాయిని కొనసాగించనుంది. ఇప్పటికే రెండు అతిపెద్ద భారీ నౌకలను నిర్మించిన బ్రిటన్ వాటిని పూర్తి స్థాయిలో 2020నాటికి ప్రారంభించనుంది. ఆ నౌకలకు సంబంధించిన వీడియోను వాటిని నిర్మిస్తున్న బ్రిటిష్ రాయల్ నేవీ విడుదల చేసింది.
యుద్ధ సమయాల్లో భారీ విమానాలు, కార్గొ విమానాలు సైతం ల్యాండింగ్ చేయగలిగేంత భారీ స్థాయిలో బ్రిటన్ వాటిని నిర్మిస్తోంది. వీటి పొడవు 919 అడుగులు ఉండనుండగా బరువు 65,000 టన్నులుగా ఉండనున్నాయి. యుద్ధ సమయాల్లో కీలకంగా ఈ నౌకలు పనిచేయనున్నాయి. యుద్ధ విమానాల కోసమే వీటిని ప్రత్యేకంగా నిర్మించారు.