brother kills sister
-
అక్కను కాల్చి చంపిన తమ్ముడు
ఇస్లామాబాద్: తన మాట ఖాతరు చేయలేదని సొంత అక్కనే కడతేర్చాడో తమ్ముడు. పాకిస్థాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తన మాట వినకుండా ఓటు వేసిందన్న కోపంతో నిందితుడు డానిష్ అలీ(20) ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. పశ్చిమ ఇస్లామాబాద్ కు 15 మైళ్ల దూరంలో ఉన్న తాజిలా పట్టణంలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న డానిష్ అలీ అక్క ఆసిఫా నొరీన్(32) స్థానిక ఎన్నికల్లో ఓటు వేసింది. ఓటు వేయొద్దని అంతకుముందే ఆమెకు అలీ హెచ్చరించాడు. తన మాట కాదని ఓటు వేసిందన్న కోపంతో ఆసిఫాను తుపాకీలో అలీ కాల్చిచంపాడని పోలీసులకు వారి తండ్రి అబ్బాస్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అక్రమ సంబంధం ఉందని.. చెల్లిని చంపేశాడు!
ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న కోపంతో.. తన సొంత చెల్లెలిని మెడకు కరెంటు వైరు బిగించి చంపేశాడో అన్నయ్య. మీరట్ సమీపంలోని లీసా రే గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నజియా అలియాస్ లజ్జో (18) అనే అమ్మాయిని ఆమె సొంత అన్న మహ్మద్ యాసిన్ (25) పీకకు కరెంటువైరు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆ అమ్మాయికి తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, దాంతో యాసిన్ ఆగ్రహం చెందాడని పోలీసులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అక్కను చంపేసి.. పోలీసులకు ఫోన్!
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 30 ఏళ్ల మహిళను ఆమె సొంత తమ్ముడే కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు.. ఆ తర్వాత పోలీసులకు స్వయంగా తానే ఫోన్ చేసి, అక్కను చంపేసినట్లు చెప్పాడు. 30 ఏళ్ల వయసున్న జ్యోతి అనే మహిళను ఆమె తమ్ముడు మొహిందర్ (27) పొడిచి చంపేశాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురం ప్రాంతంలో జరిగింది. ఆర్కె పురం సెక్టార్ 3లో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం ఏమీ లేని మొహిందర్.. తానే స్వయంగా ఫోన్ చేసి నేరం గురించి చెప్పాడన్నారు. అతడి ఒంటి మీద కడా కొన్ని కత్తి గాట్లు ఉండటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్కాతమ్ముళ్ల మధ్య ఆస్తి వివాదం వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.