జాతీయ స్కేటింగ్‌లో భ్రమేష్ సత్తా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన కుర్రాడు భ్రమేష్ పటేల్ సత్తా చాటాడు. ముంబైలో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఈవెంట్ అండర్-11 విభాగంలో భ్రమేష్ అత్యుత్తమ నైపుణ్యాన్ని కనబర్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
సికింద్రాబాద్‌లోని యమ స్కేటింగ్ అకాడమీలో అంతర్జాతీయ స్కేటర్లు అనూప్ యమ, వీరేష్ యమ, అమర్ యమ వద్ద ఈ చిన్నారి ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన భ్రమేష్ జనవరి 2 నుంచి 4 వరకు సిమ్లాలో జరిగే జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు.