నడివీధిలో జవాన్ల అరాచకపర్వం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భద్రత దళాలు కర్కశంగా ప్రవర్తించాయి. నడివీధిలో యువకుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వీడియో రూపంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.
మణిపూర్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అల్లర్ల సందర్భంగా ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. నిర్మానుషంగా ఉన్న ఓ వీధిలో భద్రత దళాలు పెట్రోలింగ్‌కు వెళ్లాయి. ఆ వీధిలో ఇద్దరు యువకులు భద్రత సిబ్బందికి కనిపించారు. అంతే జవాన్లు మానవత్వం మరచి అమానుషంగా ప్రవర్తించారు. రైఫిళ్లతో వాళ్లని కొడుతూ.. గాల్లోకి కాల్పులు జరుపుతూ భయకంపితులను చేశారు.