బీసీ కమిషన్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం
చైర్మన్ గా రాములు నియామకం రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్ చట్ట సవరణ, కమిషన్ చైర్మన్ గా బి.ఎస్.రాములు నియామకంపై ఉమ్మడి హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. న్యాయ , బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, బీసీ కమిషన్ కార్యదర్శి, చైర్మన్ బి.ఎస్.రాములుకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.