కాశ్మీర్లో మళ్లీ పాక్ రేంజర్ల కాల్పులు
జమ్ము కాశ్మీర్లోని సాంబా, జమ్ము జిల్లాల పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ రేంజర్లు భారత భూభాగంపై కాల్పులు జరిపారు. అయితే దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సాంబా జిల్లాలోని రాంగఢ్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ శిబిరాల మీద కాల్పులు జరిపినగ్లో ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. అయితే బీఎస్ఎఫ్ కూడా చూస్తూ ఊరుకోలేదని, వాళ్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని ఆయన అన్నారు.
అంతర్జాతీయ సరిహద్దులతో పాటు జమ్ము కాశ్మీర్లోని నియంత్రణరేఖ వద్ద పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు కూడా జరగనుండటంతో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఉండాలని సైన్యం అప్రమత్తం అయ్యింది.