బీఎస్పీ ఎంపీ భార్య, కుమారుడి అరెస్ట్
ఘజియాబాద్: వరకట్న వేధింపుల కేసులో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ సతీమణితో పాటు ఆయన పెద్దకుమారుడు కుమారుడు సంజయ్ కశ్యప్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఘజియాబాద్‌లో నిన్న ఉదయం ఇంట్లో బాత్రూమ్లో హిమాని శవమై కనిపించింది. ఆమె తలకు బుల్లెట్ గాయాలున్నాయి. హిమాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల క్రితం సంజయ్‌తో హిమానికి వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నారు.
మరోవైపు ఆస్పత్రిలో చేరిన ఎంపీ నరేంద్ర కశ్యప్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హిమాని మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ జరుగుతున్నామని ఎస్పీ సల్మాన్ తాజ్ తెలిపారు. ఇక హిమాని తండ్రి కూడా బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.