జాతీయ రహదారిపై ప్రమాదం
డివైడర్‌ను ఢీకొన్న లారీ
గంటకుపైగా నిలిచిపోయిన వాహనాలు
తాడేపల్లి తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జిపై ఓ లారీ అదుపుతప్పి బుధవారం రాత్రి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ ముందు టైర్లు రెండు మెయిన్ యాక్సిల్‌తో సహా ఊడిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. లారీ కూడా బ్రిడ్జిపై రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో గంటకు పైగానే జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జాతీయ రహదారి వెంబడి కొలనుకొండ నుండి కుంచనపల్లి వరకు సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనాలను ఎక్స్‌ప్రెస్ హైవే పైనే నిలిపివేశారు.
సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్రేన్ సహాయంతో లారీని బ్రిడ్జి పై నుండి తొలగించారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీ టైర్లను, మెయిన్ యాక్సిల్‌ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. రోడ్డు మీద డీజిల్ ఆయిల్ పడిపోవడంతో వాహనాలు జారుతున్న విషయం గమనించి పోలీసులు ఇసుక పోసి, ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఈ సంఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ బ్రిడ్జి మీదకు రాగానే వెనుక వస్తున్న ద్విచక్ర వాహనం అతి వేగంగా లారీ ముందుకు వచ్చి సడన్ బ్రేకు వేయడంతో లారీ డ్రైవర్ కూడా లారీని ఆపే క్రమంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.