బడ్జెట్‌కు కులం రంగా?: లోక్‌సత్తా
చైతన్యపురి(హైదరాబాద్‌సిటీ): భిన్నత్వంలో ఏకత్వంగా వెలుగొందుతున్న ప్రజలను కులం పేరిట విచ్ఛిన్నం చేయడమే గాక ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా కుల బడ్జెట్‌గా మార్చడం శోచనీయమని లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వస్తే విద్య, వైద్యం, ఉద్యోగాల ద్వారా బ్రతుకులు బాగుపడతాయన్నారు.
ఇప్పుడు ప్రజలకు బంగారు తెలంగాణ పేరిట బార్లకు, వైన్‌షాపులకు లైసెన్సులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల అందరి అభివృద్ధిని సమానంగా చూడాల్సిన ప్రభుత్వం కుల ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. విద్య, వైద్య రంగాలలో ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాలని శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వంపై మండి పడ్డారు.