పొలంలో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మేళ్లచెర్వు మండలం మల్లారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూక్యా కోట్య (50) పత్తి, మిరప సాగు చేశాడు. పత్తి పంట ఎండిపోగా, మిరపకు తెగులు సోకింది. దీంతో రూ.6 లక్షల అప్పులు తీర్చలేనేమోనని మనస్తాపం చెందిన కోట్య శనివారం రాత్రి పొలంలో పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. పొలంలో విగత జీవిగా పడిఉన్న కోట్యాను ఆదివారం పొరుగు రైతులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.