bull shark
-
వామ్మో.. ఎంత చేపో..!!
సాక్షి, విడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెదపాళెం పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపాళెంకు చెందిన మత్స్యకారుల వలకు బుధవారం 300 కేజీల భారీ బుల్ షార్క్ (సొర చేప) చిక్కింది. మత్స్యకారులు చుక్కా సుబ్రమణ్యం, ఎందేటి బ్రహ్మయ్య, పుల్లయ్య వెంకటరెడ్డిపాళెం సమీపంలోని సముద్రంలోకి వలను విసిరారు. భారీ బుల్ షార్క్ వలకు చిక్కడంతో దానిని బయటకు తీసేందుకు కష్టంగా మారింది. దీంతో స్థానికులతోపాటు 20 మంది మత్స్యకారులు ఆ చేపను బోటులో వెంకటరెడ్డిపాళెంకు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నై వ్యాపారస్తులు వచ్చి కేజీ రూ.150 చొప్పున రూ.45 వేలకు దానిని కొనుగోలు చేశారు. తామెప్పుడూ ఇంత పెద్ద చేపను చూడలేదని మత్స్యకారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ ‘బుల్ షార్క్’ను చూసేందుకు స్థానికులు అమితాసక్తి చూపారు. (చదవండి: ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమానా) -
చిర్రెత్తిన షార్క్ చుక్కలు చూపించింది
ఓ ఆస్ట్రేలియన్ డైవర్కు ఓ భారీ రాకాసి షార్క్ చుక్కలు చూపించింది. వేటాడివేటాడి తీవ్రంగా గాయపరిచింది. ఏదోలా చావు నుంచి బయటపడిన అతడు మాత్రం దాదాపు ఎనిమిదిగంటలపాటు చావుకంటే నరకాన్ని అనుభవించాడు. ఆ తర్వాతే అతడికి వైద్యం అందింది. క్వీన్స్లాండ్ తీరంలోని ఏజెన్సీ ప్రాంతంగా ఉండే గ్రేట్ బారియర్ రీఫ్లో స్కూబాకు చెందిన డైవర్ ఓ మరబోటులో వెళ్లి సముద్రంలోకి దిగాడు. అనంతరం ప్రశాంతంగా నీటి అడుగుభాగంలోకి వెళ్లి ఈదుతున్నాడు. దాదాపు 50 అడుగుల లోతుగా వెళ్లి ముందుకు వెళుతున్న సమయంలో అనూహ్యంగా వెనుక నుంచి అతడిపై షార్క్ దాడి చేసింది. అతడి చేతిని పలుమార్లుగట్టిగా కొరికింది. అలాగే కడుపులో కూడా గాయం చేసింది. వైద్య పరిభాషలో చెప్పాలంటే తీవ్ర ఆగ్రహావేశంతో అనుకొని మరి ఈ దాడిని షార్క్ చేసింది. దాదాపు ఎనిమిది చోట్ల గాయాలపాలయినప్పటికీ ఎంతో ధైర్యంగా ఈది తన మరబోటును చేరుకున్న అతడు బతుకు జీవుడా అని బోటులో పడ్డాడు. రక్తస్రావం తీవ్రంగా అవడంతోపాటు భారీ గాయాలతో దాదాపు 8గంటలపాటు నొప్పులు అనుభవించాడు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.