బంగారం వ్యాపారుల ఆందోళన
ఎక్సైజ్ సుంకం ఎత్తి వేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఇల్లందులో బంగారు వ్యాపారులు బుధవారం ర్యాలీ చేపట్టారు. బులియన్ మర్చంట్ అసోసియేషన్, బులియన్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వెంటనే ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.