గౌతం పోజిచ్చి.. మహేశ్ క్లిక్ చేస్తే.. ఖలీఫా అదృశ్యం!
నిజమే మన హీరోలకు సినిమాల్లో ఏదైనా సాధ్యమే. వారు తలుచుకుంటే ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైనా బూర్జు ఖలీపానైనా కనపించకుండా కనుమరుగు చేయగలరు. కానీ నిజజీవితంలోనూ అలాంటి రేరెస్ట్ ఫీట్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఆయన తనయుడు గౌతం ఆల్మోస్ట్ సాధించారు! విషయమేమిటంటే షూటింగ్‌లతో బిజీగా ఉన్న మహేశ్‌బాబు కాస్తా తీరిక చేసుకొని.. కుటుంబంతో కలిసి దుబాయ్ విహారానికి వెళ్లారు. దుబాయ్ ఆయన ఫేవరెట్ హాలీడే స్పాట్. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్ చేస్తున్న మహేశ్‌బాబు ఓ అరుదైన ఫొటోను తన అభిమానులతో ట్వీట్టర్లో పంచుకున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైన బూర్జు ఖలీఫా వాతావరణ ప్రభావంతో మేఘాలలో కలిసిపోగా.. దాని ఎదురుగా గౌతం పోజును మహేశ్ ఫొటోలో బంధించారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పెట్టి.. 'అరుదైన దృశ్యం. బూర్జు ఖలీఫా మేఘాలలో అదృశ్యమైంది. అవాస్తవిక వాతావరణం దుబాయ్‌లో ఇది. లవ్ ఇట్' అంటూ ఆయన పంచుకున్నారు. అన్నట్టు మహేశ్‌బాబు తాజా సినిమా 'బ్రహోత్సవం' టీజర్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదల కానుంది.
A rare sight ..The Burj Khalifa disappears into the clouds ..unreal weather in Dubai .love it. pic.twitter.com/dRhTkIi0rr
— Mahesh Babu (@urstrulyMahesh) December 26, 2015