ఓ చేతిలో తెగిన పాప తలను పట్టుకొని..
మాస్కో: ఓ చేతిలో రక్తం ఓడుతున్న నాలుగేళ్ల బాలిక తలను పట్టుకొని, మరో చేయెత్తి ‘అల్లా హో అక్బర్’ నినాదులు చేస్తూ నగరంలోని ఓ మెట్రో స్టేసన్ వద్ద ఆదివారం బురఖా ధరించి కనిపించిన ఓ 38 ఏళ్ల మహిళను చూసి బాటసారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తన పాపను చంపారని, దగ్గరికొస్తే అందర్ని పేల్చేస్తానంటూ కూడా ఆ మహిళ బెదిరించారు. తాను ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తానంటూ కూడా ఆమె నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఓక్త్యాబ్రస్కోయి మెట్రో రైల్వే స్టేషన్‌ను కొంతసేపు మూసివేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.
నస్త్యా ఎం అనే నాలుగేళ్ల బాలికను తానే చంపానని, ఆ పాప తల్లిదండ్రులతోపాటు అందరికి ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఇలా పాప తలను పట్టుకొని నినాదాలను చేసినట్లు ఆమె చెప్పారు. ఆమెను ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నాని గ్యుల్చెహరా బబోకులోవాగా గుర్తించారు. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం ఆమె గత 18 నెలలుగా ఓర్యో ప్రాంతంలోని నస్త్యా ఇంట్లో ఆమెకు బేబీ సిట్టర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం నాడు నస్త్యా తల్లిడండ్రులు 15 ఏళ్ల కొడుకును తీసుకొని బయటకు వెళ్లే వరకు నిరీక్షించిన నానీ, నడవడం రాని నాలుగేళ్ల నస్త్యాను కత్తితో మెడ నరికి చంపారు. అనంతరం ఇంటికి నిప్పంటించి, ఓ బ్యాగులో పాప తలను తీసుకొని మెట్రో రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు. అక్కడికెళ్లాక బ్యాగులోని తలను బయటకు తీసి వీరంగం వేశారు.
ఈ దారుణానికి పాల్పడినప్పుడు నాని మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉందని, మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని, అందుకని వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రికి పంపించామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఆమెపై ఎలాంటి టైస్టు ఆరోపణలు దాఖలు చేయలేదని, వైద్య పరీక్షల అనంతరం నిజానిజాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. పైశాచికత్వానికి బలైన నస్త్యా తల్లి ఓ వెడ్డింగ్ షాప్‌లో పని చేస్తుండగా, తండ్రి ఓ మొబైల్ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.