ఆస్ట్రేలియా పార్లమెంట్ ను తాకిన 'బుర్ఖా' వివాదం!
కాన్ బెరా: బుర్ఖాల ధరింపుపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రచ్చ కొనసాగుతోంది. బుర్ఖాలపై ధరింపుపై నిరసన వ్యక్తం చేస్తూ ముగ్గురు వ్యక్తులు అభ్యంతరకరమైన మాస్క్ లు ధరించి సభలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కు క్లుక్స్ క్లాన్ మాస్క్, నీకాబ్, హెల్మెట్ ధరించి పాత పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారని, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనంలో వెల్లడించింది.
బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడాన్ని నిషేధించాలని సెర్జి రెడెగల్లీ, నిక్ ఫోల్క్స్, విక్టర్ వాటర్ సన్ లు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో బుర్ఖా ధరించడాన్ని నిషేధించాలని ఓ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. బుర్ఖాపై నిరసన కార్యక్రమాలు ఆస్ట్రేలియాలో వివాదం రేపుతున్నాయి.