దళిత పరిరక్షకుడు జగ్జీవన్‌రాం
ఇన్‌బాక్స్
సమాజంలో వివక్షకు గురై సామాజికంగా, ఆర్థి కంగా వెనుకబడిన వర్గాలైన దళిత గిరిజనులకు రాజ్యాం గంలో ప్రత్యేక హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన చైతన్య దీప్తి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఆయన రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు తన జీవితాంతం పోరాడిన దళిత జనో ద్ధ్ధారకుడు బాబూ జగ్జ్జీవన్రాం. ఆయన 1908 ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలో జన్మించారు. 82 సంవత్సరాలు జీవించి 1986 జూలై 6న పరమపదించారు.
సుదీర్ఘకాలం కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధా నిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఆయన తన తుదిశ్వాస వరకు దళిత హక్కుల పరి రక్షణే ధ్యేయంగా పనిచేశారు. కేంద్ర కార్మిక మంత్రిగా కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో హరిత విప్లవం సాధించడంలో కీలక పాత్ర పోషించి రైతు పక్షపాతిగా నిలిచారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ఆ నిరంకుశ చర్యలు వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి వైదొ లిగి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తర్వాత తన పార్టీని జనతాపార్టీలో విలీనం చేశారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్ప డినప్పుడు దేశ ప్రధాని పదవికి ఆయన ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ కొందరు దళిత వ్యతిరేకులు అడ్డుకోవడంతో దేశ తొలి దళిత ప్రధాని అయ్యే అవకాశం కోల్పోయారు. ఆ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. దళితులు రాజ్యాధికారం సాధించినప్పుడే వారి పట్ల ఉన్న వివక్ష పూర్తిగా తొలగి పోతుందని భావించారు. ఆయన ఆశయ సాధనకు దళి తులు అందరూ ఏకమై పనిచేయాలి. పాలక పార్టీల చేతుల్లో పావులుగా మారకుండా, ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలకు ఉపయోగ పడకుండా రాజ్యాధి కార సాధన కోసం దళితులు పోరాడటమే బాబు జగ్జ్జీవన్రాంకు నిజమైన నివాళి కాగలదు.
(నేడు బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతి)
ఎస్. బాబురావు, కావలి
మొబైల్ : 9573011844
ప్రపంచ శాంతికి ఉగ్రవాదం అడ్డు
మొన్న బ్రస్సెల్స్, నిన్న ఢాకా, నేడు బాగ్దాద్.. ఇలా ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా వరుస పేలుళ్లతో రెచ్చిపోతున్నారు. ఈ దారుణంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి అమాయక ప్రజ లను బలితీసుకుంటున్నారు. ఇంత ఘోర మైన ఘాతుకానికి కారణం తామేనని ఉగ్ర వాద సంస్థ ఐసిస్ గొప్పలు చెప్పుకోవడం గర్హనీయం. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలనే లక్ష్యం చేసుకొని పథకం ప్రకారం మూకు మ్మడి దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులు చేస్తున్న మారణహోమంలో అభంశుభం తెలి యని చిన్నారులు, మహిళలు, అమాయకులు ఎంతో మంది చనిపోతున్నారు.
ఢాకాలోని ఓ బేకరీ రెస్టారెంట్లో 20 మంది విదేశీయులను మతం గురించి అడిగి మరీ హింసించి, గొంతు కోసి, కసితీరా చంపి రాక్షసకాండ సృష్టించారు. మతం పేరుతో దుండగులు ప్రజలను చంపడం, విధ్వంసాలు, దాడులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి దుశ్చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ముక్తకంఠంతో ప్రతి ఘటిం చాలి. ఇలాంటి ఘటనలపై ఐక్యరాజ్యసమితి వెంటనే స్పందించి నిర్ణయాత్మకమైన మార్పు నకు నాంది పలికి ఉగ్రవాదాన్ని తుదముట్టిం చాలి. అప్పుడే శాంతి, సామరస్యాలు వర్ధిల్లు తాయి. ఉగ్రవాద సంస్థల స్థావరంగా హైదరా బాద్ తయారైంది. దేవాలయాలు, జనసమ్మ ర్థంగా ఉండే ఐటీ కారిడార్లు వంటి ముఖ్యమైన ప్రాంతాలలో, దాడులు జరిపేందుకు కుట్రలు పన్ను తున్నారు.
ఉగ్రమూకలు ఏకకాలంలో పేలుళ్లకు, మార ణహోమం సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్న తరు ణంలో ఐఎన్ఏ బలగాలు దానిని భగ్నం చేయడం ఎంతో గర్వించదగ్గది. పట్టుబడిన ముష్కరులను కాలయాపన చేయకుండా కఠి నంగా శిక్షించాలి. ఇలాంటి ఉగ్రమూకల పిరికి చర్యలకు బెదిరేది లేదు. ఇదే తరుణంలో భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల ప్రజలకు సంఘీభావం తెల్పాలి. దృఢ సంకల్పంతో నిలవాలి.
బుర్రి శేఖర్, ధర్మన్నగూడ, రంగారెడ్డి
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు అవశ్యం
ప్రపంచ దేశాల్ని నిత్యమూ వణికిస్తున్న స్థాయికి ఉగ్రవాదం పెరిగిపోవడం ఆందోళనకరం. దాదా పుగా ప్రతిరోజూ ఏదో ఒక దేశం తీవ్రవాద గాట్లతో నెత్తురోడటం సర్వసాధారణమైపోయింది. పేర్లు, వాదాలు, రూపాలు, సిద్ధాంతాలు ఏైవైనా అంతి మంగా అమాయకుల్ని బలిగొనడం, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి అస్తవ్యస్త పరచడమే లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలు విరుచుకు పడుతు న్నాయి. ఇది నాగరిక సమాజానికి సంబంధించి ఉమ్మడి వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుంది. మానవ నాగరికతకే పెనుసవాలు విసురుతున్న ఉగ్రవాద సమస్యపై నేటికీ ప్రపంచం ఏకాభి ప్రాయంతో లేకపోవడం విచారకరం. జనావాసాలపై విరుచుకు పడుతున్న తీవ్రవాద సమస్యను తక్కువ చేసి చూడడం ద్వారా కొన్ని దేశాలు ఉదాసీనత వహి స్తుండగా, లాభనష్టాల బేరీజులతో మరికొన్ని దేశాలు ఉత్తుత్తి యుద్ద్ధం చేయడంతో చివరకు అన్ని దేశాలూ నష్టపోయే దశకు చేరు కున్నాయి.
ఇంతవరకూ ఉగ్రవాదాన్ని ఎలా నిర్వచిం చాలి? ఏ స్థాయిలో ఎదుర్కోవాలి? అన్న ప్రాథమిక అంశాల పట్లనే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలకు ఏకాభిప్రాయం కుదరలేదు. వివిధ కార ణాలతో అమెరికా, లాటిన్ అమెరికా, ఇస్లామిక్ యూనియన్ దేశాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయి. కనుకనే భారత్ ప్రతిపాదించిన ’అంత ర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర విధానం’ (సీసీఐటీ) దశాబ్ద కాలంగా ఐక్యరాజ్య సమితిలో అతీగతీ లేకుండా పడి ఉంది. దాని బూజు దులపాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడే అన్ని సభ్య దేశాలపై ఉంది. ఈ వైరస్ విషయంలో త్వరితంగా తమ భిన్నాభిప్రాయాల్ని తగ్గించుకొని, ఏకాభిప్రాయంతో ఏకోన్ముఖంగా అన్నిరూపాల తీవ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడి పోరు దిశగా ప్రణాళికల్ని రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాసీనత, పక్షపాత పాక్షిక యుద్ధాలతో ప్రమాదం పెరగడమేగాని ఫలితం ఉండదు.
డాక్టర్ డీవీజీ శంకరరావు
మాజీ ఎంపీ, పార్వతీపురం