bus seized
-
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్ సీజ్
ఆదిలాబాద్‌టౌన్: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్‌లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్‌లో దింపారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్‌లను సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్‌లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వీరిని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్‌లను సోమవారం సీజ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎం కల్పన పాల్గొన్నారు. -
ఆ వివరాలు ప్రజల ముందు ఉంచుతాం
సాక్షి, అమరావతి : ఈ నెల 13 నుంచి ఫిట్‌నెస్‌లేని 624స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేశామని, ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్ చేశామని, ఆ వివరాలన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని రవాణా, సమాచారం శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సచివాలయంలో ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాసులు మూడేళ్లకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైలుపై సంతకం చేశారు. మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. రవాణాశాఖ కార్యాలయాల్లో కూడాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. 24 గంటల్లోనే ఆర్టీవో అప్రూవల్ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. -
ఆంధ్రా-కర్ణాటకల మధ్య ఆర్టీసీ వార్!
అనంతపురం: ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్టీసీల మధ్య వార్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పర్మిట్ లేకుండా ఏపీలోకి ప్రవేశించిన కర్ణాటక బస్సులను సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారి మీడియాతో మాట్లాడారు. నాలుగు బస్సులను సీజ్ చేసినట్లు మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ రమణారెడ్డి వెల్లడించారు. ఇందుకు ప్రతీకారంగా గౌరీబిదనూరులో ఎనిమిది ఆర్టీసీ బస్సులను కర్ణాటక ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ బస్సుల సీజ్ విషయంపై ఏపీ అధికారులు కారణాలు తెలుసుకునేందుకు కోసం ప్రయత్నిస్తున్నారు.