సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు
సుల్తానాబాద్ (కరీంనగర్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన బంద్ కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో విజయవంతం అయ్యింది. పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, మినీ ట్రాలీల్లో అధిక డబ్బులు చెల్లించి గమ్యస్థానాలకు చేరారు.
రాజీవ్ రహదారిపై ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కనీస వేతనం రూ.15 వేలకు తగ్గకుండా ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడారి సునీల్, భార్గవి, మేఘమాల, శ్రీనివాస్ ఉన్నారు.