రైలు కింద పడి చిరు వ్యాపారి ఆత్మహత్య
ధర్మవరం టౌన్ : కడుపు నొప్పి తాళలేక ధర్మవరంలో ఓ చిరువ్యాపారి గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కేతిరెడ్డి కాలనీకి చెందిన ఈడిగ లక్ష్మీనారాయణ (55) పట్టణంలో టీకొట్టు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం నొప్పి అధికమైంది. దీంతో బహిర్భూమికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇందిరమ్మ కాలనీవాసులు గుర్తించి లక్ష్మీనారాయణ బంధువులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటసుబ్బమ్మ, కుమారులు శ్రీనివాసులు, లక్ష్మయ్య, పవన్‌కుమార్ ఉన్నారు.