'పార్టీ మార్పు పత్రికల ఊహాగానాలే'
జమ్మలమడుగు: నేను పార్టీ మారుతున్నట్లు అన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ఉహాగానాలతో వార్తలొస్తున్నాయి.. అసలు నాకు పార్టీ మారే అలోచన ఉందో లేదో గాని పత్రికలైతే పార్టీ మారాలని కోరుకుంటున్నట్లు ఉందని’ వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే (వైఎస్సార్సీపీ) సి. ఆదినారాయణరెడ్డి అన్నారు.
గురువారం ఆయన విలేకరుల సమావేశం మాట్లాడారు. ‘15 రోజులుగా పత్రికల్లో విపరీతమైన కథనాలు వస్తున్నాయి.. ఇంకా కథనాలు రావాలి.. వాటిని నేను స్టడీ చేయాలనే ఉన్నా’నన్నారు. మరికొంత మంది ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు.. వీటన్నింటినీ గమనిస్తున్నానన్నారు. పత్రికల్లో ఇప్పటి వరకు 30 తేదీలను మార్చారు కాని ఇంత వరకు నేను పార్టీ మారలేదన్నారు. తాను ఏదైనా మాట్లాడితే ఓపెన్‌గానే మాట్లాడతానన్నారు.