మాస్టర్‌మైండ్స్‌కు జాతీయ ర్యాంకులు
గుంటూరు: ఐసీఏఐ బుధవారం విడుదల చేసిన సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు అఖిల భారత స్థాయి టాప్-50 ర్యాంకుల్లో 9 ర్యాంకులు సాధించి సంచలన విజయం నమోదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ర్యాంకులు కైవసం చేసుకున్న సంస్థగా మాస్టర్‌మైండ్స్ నిలిచింది.
విద్యార్ధి జె. భిక్షాలు బాబు అఖిల భారతస్థాయిలో 9వ ర్యాంకు, కె.పవన్‌కుమార్ 24వ ర్యాంకు, కె.రవితేజ 25వ ర్యాంకు, పి.మధులిక 34వ ర్యాంకు, ఎస్.కార్తీక్ 34వ ర్యాంకు, టి.శ్రీకాంత్ 34వ ర్యాంకు, కె.రాజ్యవర్ధన్ రెడ్డి 39వ ర్యాంకు, వి.వెంకట రోహిత్ 41వ ర్యాంకు, వై.సాయి కిరణ్మయి 50వ ర్యాంకు సాధించారు.
ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ విద్యార్థులను అభినందించారు. సీఏ ఫైనల్, ఫౌండేషన్, సీఏ-సీపీటీ, ఐపీసీసీ ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు కైవసం చేసుకుని తిరుగులేని విజయం అందుకున్నామని చెప్పారు.