నేటి నుంచి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు
దివాన్‌చెరువు (రాజానగరం), న్యూస్‌లైన్ : ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్ కాస్ట్) ఆధ్వర్యంలో 21వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ) రాష్ట్ర స్థాయి పోటీలు ఆది, సోమవారాల్లో దివాన్చె రువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో జరుగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముంబైకి చెందిన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ సుధాకర్ సి. అగార్కర్ రానున్నారని సభ్య కార్యదర్శి వై. నగేష్‌కుమార్ శనివారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల నుండి 250 మంది బాల శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో 1769 ప్రాజెక్టులను బాలలు ప్రదర్శించగా, వాటిలో 112 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీటిలో 17 ప్రాజెక్టులను ఎంపిక చేసి 27 నుండి 31వ తేదీ వరకు భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు.