cake culture
-
చిలకడదుంపతో కేక్, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ బావుంటుంది
వాల్నట్ – స్వీట్‌పొటాటో కేక్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.) వాల్నట్ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు బ్రౌన్ షుగర్ – 50గ్రాములు, వెజిటబుల్ నూనె – 120 మిల్లీలీటర్లు నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్,జాజికాయ పొడి – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: చిలగడ దుంపను సిల్వర్ పేపర్లో చుట్టి.. ఓవెన్లో బాగా బేక్ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్ షుగర్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో మరో బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్ బ్లెండర్తో మరోసారి కలపాలి. దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్‌లోని బేకింగ్ బౌల్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్ బిట్స్, క్రీమ్స్‌తో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. -
'కేక్ కల్చర్‌కి దూరంగా ఉండండి..'
లండన్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లోకేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్దంగా ఉంది. రోడ్ల మీద , మురికి కాల్వల పక్కన, బాగా కాచిన నూనెతో వండిన పదార్థాలను తిని రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక ప్రపంచంలో కేక్ కల్చర్‌కి మంచి డిమాండ్ పెరిగింది. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కేక్ కట్ చేయడం ఇటీవల ఫ్యాషనై పోయింది. ఈ ఫ్యాషన్ రంగం నుంచి బయట పడండని యుకె లోని డెంటల్ కాలేజ్ ప్రొపెసర్ నైగెల్ హంట్ తెలిపారు. కేకులు తినడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారని, దీంతో ఒబెసిటీ సమస్య పొంచి ఉందని చెబుతున్నారు. ఈ తరం పిల్లల్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒబెసిటీ. ముఖ్యంగా కేక్‌లు తినడం టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. పిల్లలు ఇష్టపడుతున్నారని స్నాక్స్ పేరుతో నూడిల్స్, పానీపూరి, బేకరీ ఐటమ్స్ అందిస్తుంటాం. ఇవి ఆరగించే సమయంలో నోటికి ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ... ఆ తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. జంక్‌పుడ్స్ తినడం వల్ల ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధులొస్తున్నాయని హంట్ హెచ్చరిస్తున్నారు. ఈ తరహా పుడ్ వల్ల రోగనిరోధకశక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పొట్ట సైజు పెరగడానకి కారణాలని చెబుతున్నారు.