'100కు ఫోన్ చేస్తే.. క్షణాల్లో వస్తాయి'
హైదరాబాద్: 'షీ' టీమ్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని హైదరాబాద్ అడిషనల్ పోలీసు కమిషనర్ స్వాతి లక్రా అన్నారు. 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నాయని స్వాతి లక్రా తెలిపారు. అరెస్టయిన వారిలో 16 నుంచి 68 ఏళ్ల వయసు వారు ఉన్నారని చెప్పారు. ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాయని, పక్కా ఆధారాలతో సహా నిందితులను పట్టుకుంటాయని స్వాతి లక్రా తెలిపారు.