'వాళ్లే నా ఇంటిపై దాడిచేశారు'
విజయవాడ: బెజవాడ లబ్బీపేటలో గత అర్థరాత్రి అగంతకుడు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామల ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఇటీవల కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో చాగర్లముడి బుజ్జిపై ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాల్‌మనీ నిందితులే తన ఇంటిపై దాడి చేశారని శ్యామల మంగళవారం ఆరోపించారు. కాగా ఇంటి ప్రాంగణంలోని సీసీ కెమెరాలో రాళ్ల దాడి దృశ్యాలు రికార్డ్ అయినట్టు సమాచారం.