callmoney case
-
ఆ ఐదేళ్లూ అరాచకమే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అరాచకాలకు కేంద్ర బిందువుగా ఉండేది. ఆ పార్టీ నాయకులు చేసిన దుర్మార్గాలు అంతు లేకుండా పోయాయి. 2014 నుంచి 19 వరకూ చోటుచేసుకున్న ఘటనలు తలుచుకుంటేనే తూర్పు నియోజకవర్గ ప్రజలు భయపడిపోతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ మూలాలు తూర్పులోనే మొదలయ్యాయి. టీడీపీ నాయకులు నియోజకవర్గాన్ని పేకాట డెన్‌గా మార్చారు. నివాస ప్రాంతాల్లోనే పేకాట శిబిరాలు నిర్వహించారు. అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. బెల్ట్ షాపులతో పాటు, దందా లు ఎక్కువగా ఉండేవని ప్రజలు అంటున్నారు. కార్పొరేటర్ల అరాచకాలు సైతం మామూలుగా ఉండేవి కాదని జనం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజుల్ని తలచుకుంటేనే గజగజలాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం... టీడీపీ ప్రభుత్వంలో 2015లో వెలుగు చూసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళలను లైంగికంగా వేధించడంపై పటమట, మాచవరం పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో తూర్పు నియోజకవర్గంలోని పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. వారంతా కేవలం పాత్రదారులేనని, అసలు సూత్రదారులు నాటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరనేది కూడా తూర్పు ప్రజలందరికీ తెలుసు. తమ అధికారం ఉపయోగించి వారి పేర్లు బయటకు రాకుండా చూసుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మహిళలను లైంగిక అవసరాలకు వాడుకున్న వారిలో వారు కూడా ఉన్నారని తూర్పు ప్రజలు ఇప్పటికే చెబుతున్నారు. అలాంటి వారు నేడు శాంతియుతం అంటూ ప్రచారం చేస్తుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. దొంగలుగా మారిన తెలుగు తమ్ముళ్లు.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దొంగతనం కేసులో తెలుగు తమ్ముళ్లు నిందితులుగా అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ ఎమ్మెల్యే గద్దెకు అత్యంత అనుచరులు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 18వ డివిజన్ టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసిన పీరుబాబు, 22వ డివిజన్ టీడీపీ నేత పెద్ది అన్నారావులు బృందావనకాలనీలోని ఓ ఇంట్లో దొంగిలించిన వెండి వస్తువులను దొంగలతో కలిసి అమ్మకాలు చేపట్టగా కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాటకు డెన్‌గా.. నాడు రామలింగేశ్వరనగర్, పటమటలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్‌గా పేకాట శిబిరాలు నిర్వహించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా ఉండే ఇద్దరు, ముగ్గురు ఈ శిబిరాలు నిర్వహించే వారని ప్రజలు చెబుతున్నారు. పేకాట శిబిరాలు నిర్వహణ, పేకాట ఆడేవారంతా టీడీపీకి చెందిన వారే ఉండేవారు. అంతేకాదు గంజాయి, బెల్ట్‌షాపులు సైతం ఎక్కడ చూసినా దర్శనం ఇచ్చేవి. పటమటలంకలో ఓ కార్పొరేటర్ బంధువు బెల్ట్‌షాపు నడిపేవాడు. యువతను గంజాయికి బానిసలుగా మార్చింది సైతం ఆ సమయంలోనేనని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతుండేవారని గుర్తు చేసుకుంటున్నారు. అరాచకాలకు కేరాఫ్‌గా ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు అల్లర్లు అంటూ ప్రచారం చేస్తుండటంతో తూర్పు ప్రజలు నవ్వుకుంటున్నారు. -
కందుకూరులో మరో కాల్‌మనీ కహానీ
-
అప్పిచ్చి అంతా దోచుకున్నారు!
కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణంలో కాల్‌మనీ కేటుగాళ్లు మరోసారి బుసలు కొట్టారు. కోటకట్ట వీధికి చెందిన భార్యాభర్తలు ఓ వడ్డీ వ్యాపారి వద్ద తమ ఇంటిని తాకట్టుపెట్టి రూ. 7 లక్షలు వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా అప్పు తీరకపోవడంతో ఇంటిని బ్యాంకులో తాకట్ట పెట్టి రూ. 12 లక్షలు రుణం తీసుకున్నారు. కానీ కాల్‌మనీ వ్యాపారులు రంగంలోకి దిగారు. ప్రతి నెలా వడ్డీ దిగమింగుతోంది చాలక.. బ్యాంకు నుంచి వచ్చిన సొమ్మంతా దిగమింగారు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకొమ్మని గెంటివేశారు. దీందో బాధితులు వడ్డీ వ్యాపారి ఇంటిముందు మంగళవారం ఆందోళనకు దిగారు. వివరాలు.. మున్సిపాలిటీలోని 6వ వార్డు కోటకట్ట వీధికి చెందిన షాజహాన్, కరీమ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో పామూరు రోడ్డులోని ఉన్న ఎం. మాల్యాద్రి, ఆయన కుమారుడు నరసింహారావుకు సంబంధించిన స్థలాన్ని టిఫిన్ హోటల్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరికి డబ్బులు అవసరం కావడంతో తన ఇంటిని నరసింహారావుకు తాకట్టు పెట్టి రూ. 7లక్షలు 2016లో అప్పుగా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి రోజూ రూ. 700 చొప్పున నెలకు 21వెయ్యి వడ్డీ కడుతున్నారు. అయితే రెండు సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బులు మొత్తం వడ్డీ కట్టడానికే సరిపోకపోవడంతో బ్యాంకు నుంచి లోను తీసుకొని బాకీ డబ్బులు కట్టాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ఒక ప్రైవేటు బ్యాంకును సంప్రదించగా లోను ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. విషయాన్ని వడ్డీ వ్యాపారి నరసింహారావు దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం బ్యాంకు నుంచి రూ. 12 లక్షల లోను తీసుకున్నారు. అయితే షాజహన్, కరీమ నరసింహారవు దగ్గర రూ. 7 లక్షలు తీసుకున్న సమయంలో వ్యాపారి పేరుపై ఇంటికి సంబంధించిన పత్రాలను బదిలీ చేశారు. దాంతో బ్యాంకు అధికారులు రూ. 12 లక్షల చెక్కును నరసింహారావుకు అందజేశారు. అడ్డం తిరిగాడు.. చెక్కును మార్చుకొని అప్పుగా ఇచ్చిన రూ. 7 లక్షల నగదును తీసుకొని మిగిలిన డబ్బులు ఇవ్వాలని ఆయన ఇంటికి వెళ్లి కోరగా.. మీరే మాకు డబ్బులు ఇవ్వాలని బూతులు తిడుతూ రోడ్డు మీదకు నెట్టడంతో ఇంటి ముందు ఆందోళనకు దిగామని కరీమ, ఆమె బంధువులు తెలిపారు. ప్రతినెలా వడ్డీ కట్టిన రసీదులు కూడా ఉన్నాయని, తమకు రావలసిన నగదును ఇవ్వాలని కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అసభ్యకరమైన పదజాలంతో తిడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై వేమన సంఘటన స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిపై ఫిర్యాదు ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై పట్టణ ఎస్సై వేమనను వివరణ కోరగా ఇది సివిల్ సమస్య ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు. నరసింహారావు మాట్లాడుతూ2015లో షాజహాన్ అనే వ్యక్తి నా దగ్గర రూ. 5 లక్షలు వడ్డీకి తీసుకున్నాడని అసలు, వడ్డీ ఇవ్వాలేదన్నారు. యతేంద్ర అనే వ్యక్తి అప్పు కోసం ఒత్తిడి తేవడంతో నా చేత రూ. 7 లక్షలు కట్టించి అతని ద్వారా నాకు ఇంటి పత్రాలు తనఖా పెట్టించారన్నారు. ప్రైవేటు బ్యాంకు వారు సుమారు 11.79 లక్షలు చెక్కును ఇవ్వగా నా అకౌంటుకి జమచేసుకున్నాని చెప్పారు. -
కాల్‌మనీ కేసులో 9మంది ఇళ్లపై పోలీసుల దాడి
-
కాల్‌మనీ కేసు: 4 జిల్లాల్లో సోదాలు
-
కాల్‌మనీ కేసు: 4 జిల్లాల్లో సోదాలు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న వడ్డీ వ్యాపార సంస్థలు, పలు ఇళ్లపై దాడులు చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా, వైఎస్ఆర్ కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కడప: జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కడప నగరంలో డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి కడపలో 10 మంది, ప్రొద్దుటూరు లో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి భారీ ఎత్తున ప్రాంసరీ నోట్లు, భూముల తనఖా పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ తనిఖీలు పోలీసులు అధికారంగా వెల్లడించడం లేదు. తూర్పుగోదావరి: జిల్లాలోని రాజమండ్రిలో కూడా కాల్ మనీ కేసుకు సంబంధించి సోదాలు జరుపుతున్నారు. ముఖ్యంగా వాహన ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులు దృష్టిసారించారు. అనపర్తిలోని శివ దుర్గ అనే వాహన ఫైనాన్స్ కంపెనీలో తనిఖీలు చేపడతున్నారు. విజయవాడ: విజయవాడలోని పలువరి వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు 18 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రాంసరీ నోట్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇబ్రహిపట్నం మండలం కాసవరం గ్రామానికి చెందిన కందుల భాస్కరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా అతని వద్ద నుంచి పలు ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
కాల్‌మనీ కేసులో 9మంది ఇళ్లపై పోలీసుల దాడి
- కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు గుంటూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం గుంటూరులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మంది అనుమానితుల ఇళ్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నగరం పాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుమ్మరి చంద్ర, షేక్ బాషా, కె. మనోహర నాయుడు ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్, వెంకాయమ్మ, పాత గుంటూరు పోలీస్ సేటషన్ పరిధిలో శ్రీనివాసులు రెడ్డి, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డి. వెంకటేశ్వరరావు, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మున్ని, నాగుల్ మీరా ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, తనఖా పత్రాలు ఇతర వివరాల కోసం ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.