- కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
గుంటూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం గుంటూరులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మంది అనుమానితుల ఇళ్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నగరం పాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుమ్మరి చంద్ర, షేక్ బాషా, కె. మనోహర నాయుడు ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్, వెంకాయమ్మ, పాత గుంటూరు పోలీస్ సేటషన్ పరిధిలో శ్రీనివాసులు రెడ్డి, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డి. వెంకటేశ్వరరావు, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మున్ని, నాగుల్ మీరా ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, తనఖా పత్రాలు ఇతర వివరాల కోసం ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.