టీఆర్ఎస్ ది దౌర్జన్యమే
♦ పేదలను రోడ్డున పడేస్తారా.. సమగ్ర సర్వేకు విలువలేదా..?
♦ జవహర్‌నగర్‌లో వార్డుసభ్యులు చేస్తున్న దీక్ష న్యాయమైందే..
♦ ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తాం
♦ మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి
జవహర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతూ పేదల ఇళ్లపై జులుం చేస్తుందని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. జవహర్‌నగర్‌లో అన్ని కాలనీలను గ్రామకంఠంగా గుర్తించి ఇంటిపన్నులు తీసుకోవడాన్ని నిరసిస్తూ వార్డు సభ్యులు చేపట్టిన దీక్ష గురువారానికి 11వ రోజుకు చేరింది. గురువారం వార్డు సభ్యుల దీక్షకు ఎంపీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ప్రజ లకు అక్కడే పక్కా ఇళ్లను నిర్మించి మౌలి క సదుపాయాలను కల్పిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తూ నే రెవెన్యూ అధికారుల చేత పేదల గూళ్ల ను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ఉద్యమపార్టీ అని ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెడితే గద్దెనెక్కిన తర్వా త ఆ ప్రజలనే రోడ్డునపడేయడం వారి నిరంకుశ పాలనకు అద్దం పడుతుందన్నారు.
1995లో ఏర్పాటు చేసిన గ్రామకంఠం గెజిట్‌ను సడలించి ప్రస్తుత జనా భా ప్రాతిపదికన అన్ని కాలనీలను పరిగణనలోకి తీసుకుని గ్రామకంఠం ఏర్పా టు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకె ళ్తామన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పేదల విషయంలో ఆలోచన చేసి వారి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు సహకరించాలని అ న్నారు. జవహర్‌నగర్ ప్రజలకు న్యా యం జరిగేవరకు టీడీపీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. టీడీపీ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు తోటకూర జంగయ్య మాట్లాడుతూ ఎవరు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.
జీఓ 58,59 పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వెంటనే జవహర్‌నగర్‌లో దీక్ష చేస్తున్న వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మేడ్చల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, శామీర్‌పేట మండ ల అధ్యక్షుడు నాలిక యాదగిరి, జవహర్‌నగర్ అధ్యక్షుడు కుతాడి రవీందర్, నాయకులు చెన్నాపురం యాదయ్య, వేణు ముదిరాజ్, ఎల్వీ రమణ, సురేష్, త్యాగి, తిరుమల్‌రెడ్డి, శ్రీను, కిట్టు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.