రక్తదానంతో ప్రాణాలు పదిలం
నర్సాపూర్: రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని మహేశ్వర కాలేజీ అండ్ హాస్పిటల్ క్యాంప్ ఇన్చార్జ్ డాక్టర్మహెష్ చెప్పారు. నర్సాపూర్లోని శ్రీ విష్ణు ఇన్సిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చీ కాలేజీలో(వైపర్) మహేశ్వర కాలేజీ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా క్యాంప్ ఇన్చార్జ్ డాక్టర్ మహెశ్ మాట్లాడుతూ రక్తదానం చేసిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది జరుగకపోయినా ఏవో అనర్థాలు జరుగుతాయని చాలా మందిలో అపోహలుఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రక్తదానం చేయడంతో అనేక మందికి మేలు చేసిన వారనవుతారని అన్నారు.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్త దానం చేయోచ్చని ఆయన సూచించారు. కాగా ప్రజలలో రక్త దానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తమ కాలేజీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా రక్త దాన శిబిరం చేపట్టిన్లు చెప్పారు.
తమ కాలేజీ విద్యార్తులు సేవా కార్యక్రమాలు తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆయన వారిని అభిందించారు. కార్యక్రంలో కాలేజీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, మహెశ్వర కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, శ్రీను, ఇతర సిబ్బంది మహెష్గౌడ్, రవీందర్గౌడ్తో పాటు వూపర్ కాలేజీ ఫ్రోఫెసర్లువిద్య, అర్చన తదితరులు పాల్గొన్నారు. కాగా కాలేజీకి చెందిన సుమారు వంద మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.