capital foundation cermony
-
'శంకుస్థాపనకు ఎంత ఖర్చు చేశారు?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అయిన ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం ఆర్భాటాలు చేసిందని ఆయన విమర్శించారు. అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనకు వందలకోట్లు ఖర్చు అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దసరా పండుగ సందర్భంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నుంచి వరాలు లభిస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. -
అమరావతికి హెలికాప్టర్లో కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. ఆయన మొదట రోడ్డుమార్గంలో ఈ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లాలనుకున్నారు. అయితే రాజధాని శంకుస్థాపన నేపథ్యంలో ఈ మార్గంలో అధిక ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండటంతో సీఎం హెలికాప్టర్లో వెళ్లడమే మంచిదని అధికారులు భావిస్తున్నారు. రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్-చంద్రబాబు ఏకాంత మంతనాలు కూడా జరిపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.